తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజ్​పుత్​ కర్ణిసేన చీఫ్​ హత్య- ఇంట్లోనే కాల్చి చంపిన దుండగులు - సుఖ్​దేవ్ సింగ్ గోగమేడి మృతి

Rajput Karni Sena Chief Killed : గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి మరణించారు. రాజస్థాన్​లోని జైపుర్​లో ఈ ఘటన జరిగింది.

rajput karni sena chief killed
rajput karni sena chief killed

By PTI

Published : Dec 5, 2023, 3:12 PM IST

Updated : Dec 5, 2023, 4:22 PM IST

Rajput Karni Sena Chief Killed :రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. రాజస్థాన్​ జైపుర్​లోని శ్యామ్​నగర్​లో మంగళవారం మధ్యాహ్నం జరిగిందీ ఘటన. ఈ కాల్పులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Sukhdev Singh Gogamedi Shot Dead :రాష్ట్రీయ రాజ్​పుత్ కర్ణిసేన చీఫ్ సుఖ్​దేవ్ సింగ్ గోగమేడి ఉన్న ఇంట్లోకి నలుగురు దుండగులు ప్రవేశించి ఆయనపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన భద్రతా సిబ్బంది, మరొకరు గాయపడ్డారు. అలాగే తీవ్ర గాయాలైన సుఖ్​దేవ్ సింగ్​ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన మరణించారని జైపుర్ పోలీస్ కమిషనర్ బిజు జార్జ్ తెలిపారు. బైక్​పై దుండగులు సుఖ్​దేవ్ సింగ్ ఇంటికి వచ్చారని పేర్కొన్నారు.

అప్రమత్తమైన పోలీసులు
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానికంగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా గాలిస్తున్నారు. రాజ్​పుత్ కర్ణిసేన చీఫ్​పై కాల్పుల వార్తలు తెలుసుకుని ఆయన అభిమానులు శ్యామ్​నగర్​కు భారీగా తరలివచ్చారు. సుఖ్​దేవ్ సింగ్ గోగమేడికి మద్దతుగా జైపుర్​లో నినాదాలు చేసి నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం ఉండడం వల్ల పోలీసులు ఈ ప్రాంతంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

అక్షయ్ కుమార్ టీమ్​కు వార్నింగ్​
Karnisena Warning Padmavati Team :గతంలో రాజ్​పుత్ కర్ణిసేన పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. బాలీవుడ్​లో కొన్నాళ్ల క్రితం వచ్చిన​ 'పద్మావత్​' విడుదల విషయంలో అడ్డంకులు సృష్టించింది. సినిమాను విడుదల చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని మేకర్స్​ను హెచ్చరించింది. అలాగే అక్షయ్ కుమార్ హీరోగా నటించిన 'పృథ్వీరాజ్'​కు కర్ణిసేన నిరసన సెగ తగిలింది. రాజస్థాన్​లో జైపుర్​ దగ్గర షూటింగ్​ జరుగుతుండగా కర్ణిసేన అడ్డుకుంది. అయితే కర్ణిసేనతో మాట్లాడిన చిత్ర దర్శకుడు చంద్రప్రకాశ్.. తాను పృథ్వీరాజ్​ చరిత్రలో మార్పులేమీ చేయకుండానే సినిమా తీస్తున్నానని చెప్పారు. కానీ ఈ విషయంలో తమకు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కర్ణిసేన కోరింది. దీనికి అంగీకరిస్తేనే షూటింగ్ జరుగుతుందని తెలిపింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Last Updated : Dec 5, 2023, 4:22 PM IST

ABOUT THE AUTHOR

...view details