తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. చొరబాటు యత్నం భగ్నం.. ఇద్దరు ముష్కరులు హతం - జమ్మూకశ్మీర్ రాజౌరీ ఉగ్రదాడులు

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాల్ని భగ్నం చేశాయి భద్రతా దళాలు. సాయుధులైన ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి. ఆ ప్రాంతంలో ఆపరేషన్​ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

rajouri terror attack
rajouri terror attack

By

Published : Jan 8, 2023, 9:23 AM IST

Updated : Jan 8, 2023, 12:43 PM IST

జమ్ము కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాల్ని భద్రతా దళాలు భగ్నం చేశాయి. ఇద్దరు సాయుధులను మట్టుబెట్టాయి. ఈ మేరకు అధికారులు వివరాలు వెల్లడించారు. శనివారం రాత్రి బాలాకోట్​ సరిహద్దు వెంబడి అనుమానాస్పద కదలికలతో అప్రమత్తం అయిన సైన్యం.. ఓపెన్​ ఫైర్​ చేసిందని అధికారులు తెలిపారు. అనంతరం ​ఆ ఉగ్రవాదులను మట్టుబెట్టిందని వెల్లడించారు. ఆ ప్రాంతంలో ఆపరేషన్​ ఇంకా కొనసాగుతోందని తెలిపారు.

ఉగ్రవాదుల వద్ద భారీగా ఆయుధాలు ఉన్నాయని చెప్పారు. వారి వద్ద నుంచి రెండు ఏకే అసాల్ట్​ రైఫిల్స్, ఓ శక్తిమంతమైన ఐఈడీ బాంబ్​ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కాగా, వారు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారనేది తెలియాల్సి ఉంది.
కాగా, కొద్దిరోజుల క్రితం జమ్ముకశ్మీర్​లోని రాజౌరీ జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో గాయపడిన మరో వ్యక్తి పరిస్థితి విషమించడం వల్ల ఆదివారం ఉదయం చనిపోయాడు. దీంతో మృతుల సంఖ్య ఏడుకు చేరింది.

Last Updated : Jan 8, 2023, 12:43 PM IST

ABOUT THE AUTHOR

...view details