కొవిడ్‌పై పోరులో ఆశాకిరణంలా 2-డీయాక్సీ-డీ గ్లూకోజ్(2-డీజీ) ఔషధం అందుబాటులోకి వచ్చిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ ఔషధాన్ని రూపొందించిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ)ను ఆయన ప్రశంసించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌తో కలిసి 2-డీజీ ఔషధాన్ని ఆయన దిల్లీలో విడుదల చేశారు. తొలి బ్యాచ్ 2-డీజీ సాషెట్లను కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌కు అందించారు. ఆరోగ్య మంత్రి వాటిని దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియాకు ఇచ్చారు.
"దేశం ఆపదలో ఉన్నప్పుడల్లా డీఆర్‌డీఓ అండగా నిలుస్తోంది. 2-డీజీ ఔషధాన్ని అభివృద్ధి చేసినందుకు డీఆర్‌డీఓ ఛైర్మన్ జి.సతీష్ రెడ్డికి, శాస్త్రవేత్తలకు నా హృదయపూర్వక అభినందనలు. మన దేశంలో విపత్తు వేళ ఆశాకిరణంలా ఈ ఔషధం అందుబాటులోకి వచ్చింది. ఇది శాస్త్రీయ పురోగతికి గొప్ప ఉదాహరణ. మన దేశం ముందున్న కఠిన పరిస్థితులను ఎదుర్కోగల సామర్థ్యం మన శాస్త్రవేత్తలకు ఉందని నేను నమ్ముతున్నాను.
-రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి
ఆక్సిజన్ అవసరం తగ్గతుంది..
2-డీజీ ఔషధంతో కొవిడ్ రోగుల్లో ఆక్సిజన్‌పై చికిత్స పొందే సమయం తగ్గుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఈ ఔషధాన్ని ప్రపంచ దేశాల్లో కూడా వినియోగిస్తారని అన్నారు.