తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హెలికాప్టర్​ ప్రమాదంపై​​ రాష్ట్రపతితో రాజ్​నాథ్​ భేటీ

Rajnath Singh Kovind: భారత త్రిదళాధిపతి సహా 13 మంది ప్రాణాలు కోల్పోయిన హెలికప్టర్​ ప్రమాదంపై రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు కీలక విషయాలు తెలిపారు రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​. ఇప్పటికే త్రివిధ దళాలు దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.

Rajnath Singh Kovind
హెలికాప్టర్​ ప్రమాదంపై​​ రాష్ట్రపతితో రాజ్​నాథ్​ భేటీ

By

Published : Dec 9, 2021, 6:59 PM IST

Rajnath Singh Kovind: తమిళనాడు కూనూర్​ వద్ద జరిగిన హెలికాప్టర్​ ప్రమాదంలో భారత తొలి త్రిదళాధిపతి సహా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన, ఆ తర్వాతి పరిస్థితులపై రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు వివరించారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. రాష్ట్రపతి భవన్​లో కోవింద్​ను కలిశారు రాజ్​నాథ్​.

సైనిక బలగాలకు రాష్ట్రపతి సుప్రీం కమాండర్​గా వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలో ప్రమాదంపై వివరాలను తెలయజేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి.

అంతకు ముందు హెలికాప్టర్​ ప్రమాదంపై పార్లమెంట్​లో కీలక ప్రకటన చేశారు రాజ్​నాథ్​. ఘటనపై త్రివిధ దళాల దర్యాప్తునకు ఆదేశించినట్లు తొలుత లోక్​సభలో వెల్లడించారు. ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలో దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. విచారణ బృందం గురువారమే వెల్లింగ్టన్​కు చేరుకుందని స్పష్టం చేశారు. దర్యాప్తు సైతం ప్రారంభమైందని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details