'వన్ ర్యాంక్-వన్ పెన్షన్' ప్రకటించడం ద్వారా సైనికులకు ఇచ్చిన మాటను ప్రధాని మోదీ నిలబెట్టుకుని తన నిబద్ధతను చాటుకున్నారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. మూడు రోజుల పర్యటన కోసం లద్ధాక్ చేరుకున్న ఆయన.. లేహ్‌లో ఆర్మీ విశ్రాంత ఉద్యోగుల సమావేశంలో ప్రసంగించారు. సైన్యంలో విశిష్ఠ సేవలందించిన అనంతరం వారు ఉన్నతంగా స్థిరపడేందుకు ప్రభుత్వ సహకారం కొనసాగుతుందని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ స్పష్టం చేశారు.
"డైరెక్టరేట్ జనరల్ రీసెటిల్మెంట్ ద్వారా సైన్యంలో ఉద్యోగాలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తాం. వీటిలో అనుభవజ్ఞులకు, విశ్రాంత సైనికులకు పెద్ద సంఖ్యలో ఉపాధి లభిస్తుంది. ఈ పనిని వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం."