తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దీదీకి అభినందనలు తెలిపిన రాజ్​నాథ్​ - బంగాల్​ సీఎం కు రాజ్​నాథ్​ శుభాకాంక్షలు

బంగాల్​ ఎన్నికల ఫలితాల్లో తృణమూల్​ భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. దీంతో ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీని రక్షణ మంత్రి రాజ్​నాథ్​​ అభినందించారు.

Mamata, Rajnath
దీదీకి అభినందనలు తెలిపిన రాజ్​నాథ్​

By

Published : May 2, 2021, 6:01 PM IST

Updated : May 2, 2021, 6:37 PM IST

శాసనసభ ఎన్నికల ఫలితాల్లో తృణమూల్‌ కాంగ్రెస్, డీఎంకే పార్టీలు విజయం దిశగా దూసుకుపోతుండడంతో ఆ పార్టీ అధినేతలు మమతా బెనర్జీ, స్టాలిన్‌కు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. బంగాల్లో మమతా గెలుపుపై స్పందించిన రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ ఆమె పదవీకాలం దిగ్విజయంగా సాగాలని ట్వీట్‌ చేశారు. స్టాలిన్‌కు కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

"బంగాల్​ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి అభినంధనలు. బంగాల్​లో ఎన్నికల్లో మీ పార్టీ విజయం సాధించింది. మరోమారు సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్న తరుణంలో శుభాకాంక్షలు."

-రాజ్​నాథ్​, రక్షణ మంత్రి

అసోంలో అధికారం చేపట్టే దిశగా కమలం పార్టీ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అసోం సీఎం సర్బానంద సోనోవాల్​కు అభినందనలు తెలుపుతు రాజ్​నాథ్​ ట్వీట్​ చేశారు.

కేరళలో తిరిగి అధికారం చేపట్టనున్న ముఖ్యమంత్రి పినరయి విజయన్​కు అభినందనలు తెలుపుతూ రాజ్​నాథ్​ ట్వీట్​ చేశారు.

ఇవీ చూడండి:

టీఎంసీ హ్యాట్రిక్​ వెనుక మమత: విజయవర్గీయ

సువేందుకు షాక్​- నందిగ్రామ్​లో దీదీ జయకేతనం

Last Updated : May 2, 2021, 6:37 PM IST

ABOUT THE AUTHOR

...view details