తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అంధులకు సర్కార్​ 'స్పెషల్​' స్కూల్​.. చదువుతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులు టాప్​! - హరియాణా పానీపత్​ అంధుల పాఠశషాలు

కొందరు తమ శారీరక వైకల్యాన్ని కారణంగా చూపిస్తూ.. ఏ ప్రయత్నమూ చేయకుండా ఉంటారు. మరికొందరు మాత్రం.. ఆ వైకల్యాన్ని సైతం దాటి తమ సత్తా ఏంటో ప్రదర్శిస్తారు. ఆ కోవకు చెందిన హరియాణాలోని ప్రభుత్వ అంధుల పాఠశాల విద్యార్థులు.. చదువుతో పాటు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారు. వారందరికీ కంటి చూపు సరిగ్గా లేని కొందరు ఉపాధ్యాయులు విద్య రూపంలో బంగారు భవిష్యత్తు అందిస్తున్నారు. ఓ సారి ఆ పాఠశాల సంగతేంటో చూద్దాం రండి.

blind school of haryana
blind school of haryana

By

Published : Dec 27, 2022, 4:12 PM IST

Updated : Dec 27, 2022, 5:47 PM IST

అంధులకు సర్కార్​ 'స్పెషల్​' స్కూల్​.. చదువుతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులు టాప్​!

చదువుకు వైకల్యం అడ్డుకాదని ఆ పాఠశాల విద్యార్థులు నిరూపిస్తున్నారు. కంటి చూపు సరిగా లేకున్నా చదువుతో పాటు వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్నారు. వారందరికీ అంధులైన కొందరు ఉపాధ్యాయులు విద్య రూపంలో బంగారు భవిష్యత్తు అందిస్తున్నారు. విద్యతో పాటు సంగీతం, క్రీడలు, టెక్నాలజీ, ఎంబ్రాయిడరీ వంటి రంగాల్లో అద్భుతంగా శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులు కూడా అంతే రీతిలో నేర్చుకుని తమ భవిష్యత్తుకు పూల బాట వేసుకుంటున్నారు.

హరియాణాలోని పానీపత్​లో రాజకీయ అంధ్​ విద్యాలయ్​ పేరిట రాష్ట్ర ప్రభుత్వం కేవలం అంధుల కోసమే ప్రత్యేకంగా స్కూల్​ నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ఏకైక ప్రభుత్వ అంధుల పాఠశాల ఇదే. ఈ స్కూల్​లో 150 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అందులో 50 మంది అమ్మాయిలు ఉండగా.. 100 మంది అబ్బాయిలు ఉన్నారు. వీరికి చదువు చెప్పేందుకు 16 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. వారిలో ఆరుగురు అంధులే కావడం విశేషం.

ఈ పాఠశాలలో విద్యార్థులు చదువు మాత్రమే కాకుండా ప్రతీ ఒక్కరూ ఏదో ఒక రంగంలో ప్రావీణ్యం పొందుతున్నారు. కొందరు సంగీతం నేర్చుకుంటుండగా.. మరికొందరు స్మార్ట్​ ఫోన్​ ఎలా వాడాలో తెలుసుకుంటున్నారు. మరికొంతమంది క్రీడల్లో సత్తా చాటుతున్నారు. అమ్మాయిలంతా ఎంబ్రాయిడరీ వర్క్స్​, అల్లికలు, కుట్టు పనులు ఎంతో శ్రద్ధ నేర్చుకుంటున్నారు. ఉపాధ్యాయులు కూడా వారికి అంతే చక్కగా నేర్పిస్తున్నారు.

చెస్​ ఆడుతున్న అంధ విద్యార్థులు
కీబోర్డ్​ వాయిస్తున్న విద్యార్థి

"పదో తరగతి వరకు నేను ఇక్కడే చదువుకున్నా. అనంతరం కురుక్షేత్రలో గ్రాడ్యుయేషన్​ పూర్తి చేశాను. బీఈడీ​, ఎంఏ ఇంగ్లీష్​ కంప్లీట్​ చేశాను. అనంతరం ఈ స్కూల్​లో హిందీ, సోషల్​​ క్లాసులు చెబుతున్నాను. ఎన్​సీఈఆర్​టీ స్థాయిలో మా పాఠశాల పరీక్షలు జరుగుతాయి. ఇక్కడే చదువుకుని మళ్లీ ఇక్కడ బోధిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది."

-- గుర్నామ్​ సింగ్​, అంధ ఉపాధ్యాయుడు

"నేను ఇక్కడ ఏడో తరగతిలో చేరాను. ఇప్పుడు పదో తరగతి చదువుతున్నాను. చదువుతోపాటు మ్యూజిక్​ నేర్చుకుంటున్నాను. తబలా, కీబోర్డు, హార్మోనియంలో ప్రావీణ్యం పొందుతున్నాను. మూడు నాలుగు షోల్లో పాల్గొన్నాను. పీఆర్​ మ్యూజిక్​తో యూట్యూబ్​ ఛానల్​ నిర్వహిస్తున్నాను. 2.94వేల మంది సబ్​స్క్రైబర్లు ఉన్నారు. భవిష్యత్తులో సింగర్​ కావాలనుకుంటున్నాను."

-- అమన్​, అంధ విద్యార్థి

ఇదే స్కూల్​లో చదువుతున్న చింటూ అనే విద్యార్థికి చెస్​ ఆట అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఈ పాఠశాలలో చేరాక చెస్​ గేమ్​పై మంచి పట్టు సాధించాడు. త్వరలో జరగబోయే జాతీయ అంధుల చెస్​ టోర్నీలో పాల్గొనున్నాడు. ఈ పాఠశాలలో చదివిన విద్యార్థుల్లో సుమారు 70 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగాలను సంపాదించారు. కొందరు బ్యాంకుల్లో పీఓ, క్లర్క్​ తదితర ఉద్యోగాలు చేస్తుండగా.. మరికొందరు ప్రొఫెసర్లుగా యూనివర్సటీల్లో విద్యను అందిస్తున్నారు.

స్మార్ట్​ఫోన్​ వాడుతున్న విద్యార్థి
అల్లికలు చేస్తున్న అంధ విద్యార్థులు
Last Updated : Dec 27, 2022, 5:47 PM IST

ABOUT THE AUTHOR

...view details