తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అరంగేట్రంతో రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రభావమూ ఉండబోదని తమిళనాడు సహకార మంత్రి సెల్లూర్ కే రాజు అన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు దివంగత ఎంజీ రామచంద్రన్ లేదా జయలలితలా విజయవంతం కాలేరన్నారు. తమిళనాడులో సీఎం పళనిస్వామి ప్రభంజనం కొనసాగుతోందని, రాష్ట్రంలో ఎవరు పాలించాలో, కేంద్రంలో ఎవరు ఉండాలో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు.
'ఎంజీఆర్, జయలలితలా రజనీ విజయం సాధించలేరు'
రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు దివంగత ఎంజీఆర్, జయలలితలా విజయవంతం కాలేరని తమిళనాడు సహకార మంత్రి సెల్లూర్ కే రాజు అన్నారు. రజనీకాంత్ అరంగేట్రంతో రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రభావమూ ఉండబోదని చెప్పారు. నిన్నటి వరకు ఇంటికే పరిమితమైన నటులు.. ఈ రోజు ప్రజాక్షేత్రానికి వస్తున్నారన్నారు.
వచ్చే ఏడాది జనవరిలో రాజకీయ పార్టీ పెడతానని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ రజనీకాంత్ చేసిన ప్రకటనపై మంత్రి స్పందించారు. నిన్నటి వరకు ఇంటికే పరిమితమైన నటులు.. ఈ రోజు ప్రజాక్షేత్రానికి వస్తున్నారన్నారు. రజనీకాంత్ ప్రవేశంతో తమిళ రాజకీయాల్లో కొత్తగా చూసేదేమీ ఉండదన్నారు. కొత్తగా వచ్చేవాళ్లకు తమిళ ఓటర్లు తగిన పాఠం నేర్పుతారని తెలిపారు. అందరూ ఎంజీఆర్, జయలలితలా విజయవంతం కాలేరని, ప్రజల కోసం కష్టపడే వారే సక్సెస్ అవుతారని మంత్రి వ్యాఖ్యానించారు.
ఇవీ చూడండి