రాజకీయాల్లోకి రావట్లేదని మరోసారి తేల్చిచెప్పిన రజనీకాంత్ - will not enter in politics says rajanikanth

11:25 January 11
రాజకీయాల్లోకి రావట్లేదని మరోసారి తేల్చిచెప్పిన రజనీకాంత్
రాజకీయాల్లోకి తాను రావట్లేదని మరోసారి తేల్చిచెప్పారు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్. రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి చేయవద్దని అభిమానులను తలైవా కోరారు. అభిమానుల ప్రవర్తనతో కలత చెందానని పేర్కొన్నారు. 'వా తలైవా వా' అని నినాదాలు చేస్తూ రజనీ అభిమానులు, రజనీ మక్కల్ మంద్రం సభ్యులు ఆదివారం ఆందోళన చేశారు. అభిమానులు సాధారణ ప్రజాణీకానికి ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా నిరసనలు చేశారని రజనీ ప్రశంసించారు.
కానీ..తన నిర్ణయంలో మార్పు ఉండదనీ, ఇకపై ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని ట్విట్టర్ ద్వారా అభిమానులను కోరారు. తాను రాజకీయాల్లోకి రాకపోవడానికి గల కారణాలను సైతం ఇది వరకే చెప్పానని గుర్తుచేశారు.