తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Rajinikanth Phone Call to Lokesh : తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చంద్రబాబును ఏమీ చేయలేవు: రజనీకాంత్​

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2023, 3:12 PM IST

Updated : Sep 13, 2023, 5:35 PM IST

Rajinikanth_phone_call_to_Lokesh
Rajinikanth_phone_call_to_Lokesh

15:04 September 13

లోకేశ్​కు ఫోన్ చేసి ధైర్యంగా ఉండాలని చెప్పిన సూపర్‌స్టార్ రజనీకాంత్

Rajinikanth phone call to Lokesh : తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చంద్రబాబును ఏమీ చేయలేవు..

Rajinikanth phone call to Lokesh : తన మిత్రుడు చంద్రబాబు ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పరితపించే గొప్ప పోరాట యోధుడని, ఈ తప్పుడు కేసులు.. అక్రమ అరెస్టులు ఆయనని ఏం చేయలేవని తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ ధీమా వ్యక్తం చేశారు. నారా లోకేశ్​ కి ఫోన్ చేసి పరామర్శించిన రజనీకాంత్... ధైర్యంగా ఉండాలని సూచించారు. తనకు ఆత్మీయ మిత్రుడైన చంద్రబాబు తప్పు చేయరని, చేసిన మంచి పనులు, నిస్వార్థమైన ప్రజా సేవ, ఆయనను క్షేమంగా బయటకు తీసుకొస్తాయని రజనీకాంత్‌ పేర్కొన్నారు.

చంద్రబాబును కలిసిన లూథ్రా... తెలుగుదేశం అధినేత చంద్రబాబుని కలిసేందుకు సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి వెళ్లారు. ములాఖత్ ద్వారా చంద్రబాబును కలిసి న్యాయస్థానంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు వివరించారు.

నేడు రాజమహేంద్రవరానికి జనసేన పార్టీ అధ్యక్షుడు... రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబును జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు కలవనున్నారు. పవన్ చంద్రబాబుకు మద్దతు తెలపనున్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులను కూడా పవన్ కల్యాణ్ కలిసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

జనసేన నేతల సంఘీభావం.. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు విశాఖ జిల్లా జనసేన నేతలు సంఘీభావం తెలిపారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్, చోడవరం ఇంచార్జ్ పీ.ఎస్. ఎన్.రాజు, కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ బుధవారం రాజమహేంద్రవరంలో లోకేశ్ ను కలిసి పరామర్శించారు. చంద్రబాబును తప్పుడు కేసులతోనే జైలుపాలు చేశారని మండిపడ్డారు. అక్రమ కేసులతో ప్రభుత్వం ప్రతిపక్షాలను ఇబ్బందులు పెడుతోందని అన్నారు. జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు చీత్కరించుకుంటున్నారని మండిపడ్డారు. తనకు అండగా నిలుస్తున్న జనసేన నేతలకు లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీని రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు అంతా కలిసి పోరాడతామన్నారు.

Last Updated : Sep 13, 2023, 5:35 PM IST

ABOUT THE AUTHOR

...view details