తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అత్యాచార బాధితురాలికి కన్యత్వ పరీక్ష.. పబ్లిక్ టాయిలెట్​లో నవజాత శిశువు! - Delhi Girl rape

Rajasthan kukari ki rasam: రాజస్థాన్​లో అంధ విశ్వాసాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తొలిరాత్రి రక్తస్రావమైతేనే మహిళ కన్యగా భావించే కొందరు.. అత్యాచార బాధితురాలిపై వివక్ష ప్రదర్శించారు. మరోవైపు, గుర్తుతెలియని ఓ మహిళ టాయిలెట్​లో శిశువుకు జన్మనిచ్చింది. చిన్నారిని అందులోనే వదిలేసి వెళ్లింది.

maharashtra infant in toilet
maharashtra infant in toilet

By

Published : May 26, 2022, 4:45 PM IST

Rajasthan kukari ki rasam:రాజస్థాన్​లో మూఢవిశ్వాసాలు మహిళల పాలిట శాపాలుగా మారుతున్నాయి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అంధ విశ్వాసాలను పాటిస్తూ.. మహిళల పట్ల వివక్ష చూపుతున్నారు. భిల్వారాలోని శాంసీ ప్రాంతంలో ఓ మహిళ ఇదే తరహాలో వివక్షకు గురవుతోంది.

వివరాల్లోకి వెళితే...
శాంసీలో నివసించే మహిళపై పొరిగింటి వ్యక్తి గతంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గురించి ఎవరికైనా చెబితే.. ఆమెతో పాటు, ఆమె తోబుట్టువులను సైతం చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు దీని గురించి ఎవరికీ చెప్పలేదు. కొద్దిరోజుల తర్వాత ఆమెకు వివాహం జరిగింది. అయితే, అక్కడి ఆచారాల ప్రకారం పెళ్లి అయిన తర్వాత.. మహిళకు కన్యత్వ పరీక్ష నిర్వహిస్తారు. తొలిరాత్రి మహిళకు రక్తస్రావం జరిగితేనే ఆమె కన్య అని నమ్ముతారు. ఈ విషయం అందరికీ తెలిసేలా.. తొలిరాత్రి రోజు బెడ్​పై పరిచిన తెల్లని గుడ్డను బహిరంగంగా చూపిస్తారు.

దీంతో అత్యాచారానికి గురైన బాధితురాలిపై తన భర్త అనుమానాలు వ్యక్తం చేశాడు. కుటుంబ సభ్యులంతా ఆరా తీయగా.. జరిగిన విషయాన్ని చెప్పేసింది ఆ మహిళ. రేప్ చేసిన వ్యక్తిపై మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, పంచాయతీ పెద్దలు మాత్రం బాధితురాలినే.. దోషిని చేశారు. పెళ్లి చేసుకున్న యువకుడికి అన్యాయం చేశారన్న ఆరోపణలతో ఈ విషయంపై శుక్రవారం పంచాయతీ పెట్టాలని నిర్ణయించారు. పెద్దలంతా చర్చించి బాధితురాలి కుటుంబానికి జరిమానా విధించనున్నారు.

సాధారణంగా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు జరిమామా విధిస్తుంటారు. డబ్బు కట్టకపోతే గ్రామం నుంచి వెలివేస్తారు. కొందరైతే ఉన్నఆస్తులన్నీ అమ్మేసుకొని జరిమానా కట్టేందుకు ప్రయత్నిస్తారు. అయితే, స్థానిక సామాజిక కార్యకర్తలు ఈ సంప్రదాయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మహిళ వ్యక్తిత్వాన్ని నిర్ణయించే అధికారం ఏ పంచాయతికీ లేదని సామాజిక కార్యకర్త సుమన్ దేవతియా పేర్కొన్నారు. పంచాయతీల నిర్ణయాలు చట్టబద్ధమైనవి కాదని చెప్పారు. ప్రభుత్వాలు ఇప్పటికీ ఈ విషయాలపై నిర్ణయాలు తీసుకోలేకపోవడం బాధాకరమని అన్నారు.

Infant found in public toilet:మహారాష్ట్ర పుణెలో ఓ నవజాత శిశువును పబ్లిక్ టాయిలెట్​లో పడేసి వెళ్లారు. వాగ్దావ్ భద్రుక్ ప్రాంతంలోని తుకాయినగర్​ వద్ద ఉన్న మహిళా పబ్లిక్ టాయిలెట్​లో శిశువు కనిపించిందని పోలీసులు తెలిపారు. చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. గుర్తు తెలియని మహిళ.. టాయిలెట్​లో శిశువుకు జన్మనిచ్చిందని, అక్కడే చిన్నారిని వదిలిపెట్టి వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు.

శిశువు ఏడుపు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటి వెళ్లి చిన్నారిని కాపాడారు పోలీసులు. శిశువు టాయిలెట్​లో ఇరుక్కుపోయిందని, బయటకు తీసేందుకు ప్రయత్నించగా చిన్నారికి తీవ్ర రక్తస్రావం అయిందని పోలీసులు వెల్లడించారు. అతికష్టం మీద చిన్నారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.

Delhi Girl rape:
మరోవైపు, దిల్లీలోని పశ్చిమ్ విహార్ ప్రాంతంలో 12ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఐదుగురు మైనర్లేనని పోలీసులు వెల్లడించారు. గత శుక్రవారం పశ్చిమ్ విహార్ రైల్వే గేట్ సమీపంలోని అటవీ ప్రాంతంలో బాలికపై అత్యాచారం జరిగింది. నిందితులు ఈ ఘటనను వీడియో తీశారు. అదే రోజు రాత్రి బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

'గ్యాస్ రీఫిల్ కోసం షాప్​కు వెళ్లిన సమయంలో.. పొరిగింట్లో ఉండే ఓ అబ్బాయి తనను వేరే చోటుకు తీసుకెళ్లాడని బాలిక పేర్కొంది. రైల్వే ట్రాక్ సమీపంలో మరో ఐదుగురు ఉన్నారని తెలిపింది. అత్యాచారం జరిగిన తర్వాత ఇంటికి చేరుకున్న బాలిక.. కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది' అని పోలీసులు వివరించారు. నిందితుల్లో ముగ్గురు దిల్లీ దాటి పారిపోయేందుకు ప్రయత్నించారని.. ఫోన్ల లొకేషన్ ఆధారంగా వారిని పట్టుకున్నామని తెలిపారు.

Odisha Constable sexual assault:
ఒడిశా భువనేశ్వర్​లో ఓ బాలికను లైంగిక వేధింపులకు గురిచేశారన్న ఆరోపణలతో పోలీస్ కానిస్టేబుల్ అరెస్టయ్యాడు. నిందితుడిని రజనీకాంత్ గమాంగేగా గుర్తించారు. నిందితుడు లింగరాజ్ పోలీస్ స్టేషన్​లో ఓఏపీఎఫ్ కానిస్టేబుల్​గా పనిచేస్తున్నాడు. బాలికపై లైంగిక దాడి చేసి.. వీడియో చిత్రీకరించాడు. రూ.50 వేలు ఇస్తేనే వీడియో డిలీట్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడు. చైల్డ్​లైన్ సహాయ కేంద్రానికి కాల్ చేసిన బాధితురాలు.. నిందితుడిపై స్థానిక మహిళా స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. అనంతరం నిందితుడు అరెస్టయ్యాడు. అతడి ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టైన పోలీస్ కానిస్టేబుల్

Police encounters Assam:సామూహిక అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తిని పోలీసులు తుపాకీతో కాల్చారు. కస్టడీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా, అతడిపై కాల్పులు చేసినట్లు పోలీసులు తెలిపారు. అసోంలోని కోక్రఝర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నిందితుడికి గాయాలయ్యాయని, స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడు సోమవారం రాత్రి మరో ఇద్దరితో కలిసి 16ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడని జిల్లా అదనపు ఎస్పీ ఎస్ఎస్ పనేసర్ తెలిపారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details