Rajasthan Udaipur accident: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న పికప్ ట్రక్కు 30 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 15 మంది గాయపడ్డారు. ప్రయాణికులంతా ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఉదయ్‌పుర్ సమీపంలోని నందేశ్వర్ మహాదేవ్ మందిరం వద్ద ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఎంబీ ఆస్పత్రికి తరలించారు.
అదుపు తప్పి లోయలో పడ్డ పికప్ ట్రక్కు.. ఐదుగురు మృతి - ఉదయ్‌పుర్ రోడ్డు ప్రమాదం
Rajasthan Udaipur accident: సామర్థ్యానికి మించి ప్రయాణికులతో వెళ్తున్న పికప్ ట్రక్కు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 15 మంది గాయపడ్డారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
ఖార్పనా గ్రామానికి చెందిన వీరంతా.. కాలివాస్ గ్రామంలోని ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. పికప్ ట్రక్కులో వెళ్లిన వీరు.. అదే వాహనంలో సాయంత్రం వెనుదిరిగారు. అయితే, మధ్యలో వాహనం అదుపు తప్పింది. ఒక్కసారికా రోడ్డు పక్కన ఉన్న లోయలోకి పడిపోయింది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు. ఐదుగురు మరణించగా.. నలుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడమే ప్రమాదానికి ప్రధాన కారణమని అధికారులు అనుమానిస్తున్నారు.
- Udaipur accident Ashok Gehlot tweet:ప్రమాద ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు వెంటనే కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి:పుట్టగొడుగులు తిని 13 మంది మృతి