తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రక్తమోడిన రహదారులు.. రోడ్డుప్రమాదాల్లో 20 మంది మృతి

Rajasthan road accidents: రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రహదారులు రక్తసిక్తమయ్యాయి. వివిధ రోడ్డు ప్రమాదాల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Rajasthan road accidents
రక్తమోడిన రహదారులు

By

Published : May 15, 2022, 7:58 PM IST

Rajasthan road accidents: రాజస్థాన్​లో రహదారులు రక్తమోడాయి. ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదాలు అనేక కుటుంబాల్లో విషాదం నింపాయి. రాజస్థాన్​లో జరిగిన మూడు ప్రమాదాల్లో మొత్తం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర​లో జరిగిన మరో ప్రమాదంలో నలుగురు మరణించారు.

రాజస్థాన్ సిరోహీ జిల్లాలో జరిగిన ఓ దుర్ఘటనలో.. ఆరుగురు మరణించారు. ఓ ట్రక్కు.. రెండు కార్లతో పాటు మరో ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదురుగు తీవ్రంగా గాయపడ్డారు. సిరోహీ నుంచి శివగంజ్​కు వెళ్తున్న ట్రక్కు.. అదుపుతప్పి పక్క లేన్​లోకి దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న రెండు కార్లు, ఓ ట్రక్కును ఢీకొట్టిందని చెప్పారు. మృతుల్లో మూడు నెలల పసికందు సైతం ఉందని వెల్లడించారు. ఘటన జరిగిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే సన్యమ్ లోధా.. క్షతగాత్రులు ఉన్న ఆస్పత్రిని సందర్శించారు.
రాజస్థాన్​లోని అల్వార్​లో ట్రక్కు, ఆటో ఢీకొట్టుకోవడం వల్ల.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు. సికంద్ర హైవేపై ఈ ఘటన జరిగింది.

మరోవైపు, రాజసముంద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు.. ట్రక్కు ఢీకొనగా... నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటనస్థలిలోనే ముగ్గురు మరణించగా... చికిత్స పొందుతూ మరొకరు తుదిశ్వాస విడిచారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు చెప్పారు. జైపుర్ నుంచి వస్తున్న బస్సు.. తెల్లవారుజామున 5.30 గంటలకు ట్రక్కును ఓవర్​టెక్ చేసే క్రమంలో అదుపుతప్పిపోయిందని అధికారులు చెప్పారు. దీంతో ట్రక్కును ఢీకొట్టిందని తెలిపారు.
అటు, అజ్మీర్ జిల్లాలో జరిగిన మరో ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అల్వార్​గేట్ సమీపంలోని నరేలీ బైపాస్ వద్ద ట్రక్కును మరో వాహనం ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు.

Road accident in Maharashtra: మహారాష్ట్ర అహ్మద్​నగర్​లో జరిగిన ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రాహురీ తాలుకాలోని గుహా ఫతా వద్ద ఈ ఘటన జరిగింది. నగర్ నుంచి శిర్డీకి వెళ్తున్న బస్సు.. ఆదివారం మధ్యాహ్నం ఓ కారును ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. అందులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రాణాలు కోల్పోయారని, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు.

నుజ్జు నుజ్జు అయిన కారు
పూర్తిగా ధ్వంసమైన కారు

ఇదీ చదవండి:

కాలువలోకి దూసుకెళ్లిన 'పెళ్లి కారు'.. ఆరుగురు మృతి

'పెదాలపై ముద్దుపెట్టడం అసహజ లైంగిక నేరం కాదు'

ABOUT THE AUTHOR

...view details