తెలంగాణ

telangana

అంత్యక్రియలకు తోపుడుబండిపైనే తల్లి మృతదేహం

By

Published : May 10, 2021, 10:17 AM IST

అంతర్జాతీయ మాతృ దినోత్సవం(మే 9న) రోజే హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. కొవిడ్​తో ప్రాణాలు కోల్పోయిన ఓ తల్లి మృతదేహాన్ని శ్మశానానికి తరలించేందుకు అంబులెన్స్​ కరవైంది. దీంతో చేసేదేమీలేక తోపుడుబండిపైనే తీసుకెళ్లారు ఆమె కుమారులు. రాజస్థాన్​లో జరిగిన ఈ ఘటన పలువురి హృదయాల్ని కదిలించింది.

Covid dead body, Hand cart
కొవిడ్​ మృతదేహం, తోపుడుబండి

తోపుడు బండిపై తల్లి మృతదేహాన్ని తరలిస్తున్న కొడుకులు

రాజస్థాన్​లో హృదయవిదారక ఘటన జరిగింది. ప్రపంచ మాతృ దినోత్సవం రోజున.. తల్లి మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్​ కోసం ఆపసోపాలు పడ్డారు కొడుకులు. చివరకు తోపుడుబండిపై తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.

ఆస్పత్రిలో చేరాక.. మళ్లీ ఇంటికి..

ఝాలావాడ్​కు చెందిన అపర్ణ సుశాంత అనే మహిళ.. గత నెల 30వ తేదీన కరోనా బారినపడ్డారు. చికిత్స నిమిత్తం దబ్లా ఖీంచీలోని కొవిడ్​ కేర్​ సెంటర్​లో చేరారు. తమ బంధువు ఒకరు ఇదే ఆసుపత్రిలో చేరి రెండు రోజుల తర్వాత మరణించారు. ఈ పరిస్థితుల్లో ఆందోళనకు గురైన సుశాంత తనను ఇంటికి తీసుకెళ్లాలని కుమారుడు దినేశ్​ను కోరారు. తల్లి అభ్యర్థనతో ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి చేసి.. ఇంటికి తీసుకొచ్చారు దినేశ్​, అతడి సోదరుడు. అయితే.. పరిస్థితి విషమించి ఈ నెల 8న(శనివారం) ప్రాణాలు కోల్పోయారు సుశాంత.

ఇదీ చదవండి:చనిపోయిన తర్వాత కొవిడ్ మృతదేహానికి ఆక్సిజన్

ఈ నేపథ్యంలో తల్లి మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్​ కోసం దినేశ్, అతడి సోదరుడు తీవ్రంగా శ్రమించారు. చివరకు పోలీసులు, వైద్య సిబ్బందిని వేడుకున్నా.. ఫలితం లేకపోయింది. ఇక చేసేదేమీ లేక.. అందుబాటులో ఉన్న తోపుడుబండిపై సుశాంత మృతదేహాన్ని తరలించి అంత్యక్రియలు ముగించారు.

'మాకు సమాచారం అందలేదు'

ఈ ఘటనపై అధికారులు స్పందించారు. కొవిడ్​ కేర్​ సెంటర్​లో మరణించిన రోగికి ప్రోటోకాల్​ అనుసరించి.. కొవిడ్​ మార్గదర్శకాల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని తెలిపారు. అయితే సుశాంత మరణం గురించి తమకెలాంటి సమాచారం అందలేదని ఆస్పత్రి సిబ్బంది బీసీఎంఓ అంకుర్​ సోమాని చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి:కరోనా కట్టడికి.. 'సుప్రీం' చొరవే చుక్కాని!

ABOUT THE AUTHOR

...view details