తమ రాష్ట్రంలో కొవిడ్ టీకాల కొరత ఉందని రాజస్థాన్ ఆరోగ్య మంత్రి డాక్టర్ రఘు శర్మ తెలిపారు. కేంద్రం కేటాయించిన కోటి టీకా డోసులు వినియోగించినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం టీకాలు లేని కారణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.
రాజస్థాన్లో కొవిడ్ కేసులు తీవ్రంగా పెరుగుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంపై మౌనంగా ఉన్నారని శర్మ ఆరోపించారు. టీకాల కొరత ఉందని చెబుతున్న ప్రతిసారి.. కేంద్రం దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఏదో ఓ సాకు చెబుతోందన్నారు.
"రాజస్థాన్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ పునఃప్రారంభించాలంటే కేంద్రం మరిన్ని వ్యాక్సిన్లు పంపిణీ చేయాలి. ప్రస్తుతం 45 ఏళ్లు పైబడినవారే వ్యాక్సిన్లు తీసుకుంటున్నారు. కానీ, వైరస్ ఎక్కువగా 18 ఏళ్లు పైబడినవారికి సోకుతోంది. ఈ వయసు వారికీ వ్యాక్సిన్ ఇవ్వడం అవసరం."