తెలంగాణ

telangana

ETV Bharat / bharat

15ఏళ్ల బాలికపై హత్యాచారం- అడవిలో నగ్నంగా మృతదేహం - రాజస్థాన్ రేప్​

Rajasthan rape case: రాజస్థాన్​లో అత్యంత పాశవిక ఘటన వెలుగుచూసింది. 15 ఏళ్ల బాలికను ఇద్దరు కిరాతకులు అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని నగ్నంగా అడవిలో పడేశారు. 12 గంటల్లోనే పోలీసులు నిందితులను పట్టుకున్నారు.

rajasthan-rape-case
15ఏళ్ల బాలికపై హత్యాచారం- అడవిలో నగ్నంగా మృతదేహం

By

Published : Dec 25, 2021, 12:14 AM IST

Rajasthan rape case: రాజస్థాన్​ కోటలో అత్యంత దారుణ ఘటన జరిగింది. 15 ఏళ్ల బాలికపై ఇద్దరు మృగాళ్లు అత్యాచారానికి పాల్పడి ఆపై క్రూరంగా హత్య చేశారు. మృతదేహాన్ని నగ్నంగా అడవిలో పడేశారు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు 200మంది సిబ్బంది, స్నైఫర్ డాగ్స్​తో రంగంలోకి నిందితులను 12 గంటల్లోనే పట్టుకున్నారు. ఇద్దరూ నేరాన్ని అంగీకరించారు.

బాధితురాలి పొరుగింటి వ్యక్తులే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు చెప్పారు. కాలకృత్యాల కోసం బయటకు వెళ్లిన ఆమెను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారని వివరించారు.

బాలికను రేప్ చేసిన అనంతరం ఇద్దరూ ఆమె గొంతు కోశారు. తలపై బాదారు. ఒంటిపై పంటిగాట్లు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆమెను హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని నగ్నంగా తీసుకెళ్లి అడవిలో పడేశారని చెప్పారు. బాలిక కోసం గాలిస్తుండగా.. రక్తపు మడుగులో ఉన్న మృతదేహాన్ని అడవిలో గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంత బాలిక ఇంటికి సమీపంలోనే ఉందని, బూందీ జిల్లా పరిధిలోకి వస్తుందని తెలిపారు.

ఇదీ చదవండి:రూ.5వేలు తీసుకుని భార్యను బలవంతంగా ఇద్దరితో...

ABOUT THE AUTHOR

...view details