Rajasthan Omicron suspected: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు భారత్‌లో బయటపడ్డాయి. కర్ణాటక బెంగళూరులో ఇద్దరికి ఈ వేరియంట్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఇప్పుడు రాజస్థాన్ జైపుర్‌లో కూడా ఒమిక్రాన్ వ్యాపించిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణాఫ్రికా నుంచి ఇటీవల జైపుర్‌కు వచ్చిన ఓ కుటుంబానికి కరోనా సోకినట్లు నిర్ధరణ కావడమే ఇందుకు కారణం.
"జైపుర్‌లోని దాదీ కా ఫాటక్ ప్రాంతంలో నివసించే ఓ కుటుంబంలోని ఇద్దరు చిన్నారులు సహా నలుగురు వ్యక్తులు కొవిడ్ బారినపడ్డారు. వారంతా ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగివచ్చారు. వారికి ఒమిక్రాన్ వేరియంటే సోకిందా అన్నదానిపై ప్రస్తుతం స్పష్టత లేదు. వారి నమూనాలను జన్యుపరీక్షల కోసం పంపించాం. ప్రస్తుతం ఆ కుటుంబం ఐసొలేషన్‌లో ఉంది. వారితో సన్నిహితంగా ఉన్నవారి వివరాలను సేకరిస్తున్నాం."
-అధికారులు
Omicron india: కర్ణాటక బెంగళూరులోనే రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 11, 20వ తేదీల్లో బెంగళూరుకు వచ్చిన వారిలో ఒమిక్రాన్ నిర్ధరణ అయినట్లు వెల్లడించారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్. వీరిలో ఒకరి వయసు 66ఏళ్లు కాగా.. మరొకరి వయసు 46 ఏళ్లని తెలిపారు. అయితే, గోప్యతను దృష్టిలో ఉంచుకొని వారి పేర్లను వెల్లడించడం లేదని అన్నారు. వీరిద్దరికీ తొలుత కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ కావడం వల్ల ఆ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ చేశామని, వారిద్దరిలో ఒమిక్రాన్ ఉన్నట్టు ఇన్‌సాకాగ్ నిర్ధరించినట్లు వెల్లడించారు. బాధితుల్లో తీవ్ర లక్షణాలు కనిపించలేదని తెలిపారు.
ఇదీ చూడండి:Omicron India News: ఆ ఎనిమిది మందికి కరోనా.. ఒమిక్రాన్ భయంతో...
ఆ 9 మందికి కరోనా..