నలుగురిలో విభిన్నంగా ఉండాలనే తపన.. ఆయన ఆహార్యాన్ని ప్రత్యేకంగా మార్చింది. రాజస్థాన్లోని బిల్వారా జిల్లా షాహ్పురా పట్టణానికి చెందిన మహమ్మద్ ఇసాక్ ఖాన్ ఏళ్ల తరబడి గడ్డం పెంచేశాడు. ఏకంగా రెండు అడుగుల మేర పెరిగిపోయింది. ఇప్పుడదే అతనికి బోలెడంత గుర్తింపు తెస్తోంది. ఇసాక్ ఖాన్ను చూసేందుకే ప్రజలు తరచూ ఆయనింటికి వస్తుంటారు.
" చిన్నతనం నుంచే ఏదైనా భిన్నంగా చేయాలన్న తనప ఉండేది. ఈ క్రమంలోనే గడ్డం పెచుకోవడం ఆసక్తిగా మారింది. నా గడ్డానికి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు వచ్చాయి. గడ్డం అలంకరణ విషయంలోనూ 15 రాష్ట్రాలకు చెందిన 60 మందితో పోటీ పడి జాతీయ ఛాంపియన్గానూ నిలిచా "