తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Man kills wife: భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త - extramarital affairs

భార్యను క్రూరంగా గొడ్డలితో నరికి హత్య చేశాడు ఓ భర్త (man kills wife). గదిలో నెత్తురోడుతూ విగతజీవిగా పడి ఉన్న తల్లి చూసిన కుమారుడు.. తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దారుణం రాజస్థాన్​లో జరిగింది.

man kills wife
భార్యను చంపిన భర్త

By

Published : Aug 29, 2021, 4:57 PM IST

భార్యను అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు ఓ భర్త (man kills wife). ఈ ఘటన రాజస్థాన్​లోని భివాండీలో జరిగింది. మిలక్​పుర్​కు చెందిన సాహీనా(35)పై అనుమానంతో ఆమె భర్త ముస్తాక్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

"మద్యం మత్తులో ఉన్న ముస్తాక్ తొలుత సాహీనా ముఖంపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. ఆమె లేవలేని స్థితిలో ఉండగా గొంతును గొడ్డలితో దారుణంగా నరికేశాడు." అని పోలీసులు తెలిపారు. సాహీనాకు ఐదుగురు పిల్లలు. ఆమె పెద్ద కుమారుడి ఫిర్యాదు మేరకు ముస్తాక్​పై కేసు నమోదు చేశారు పోలీసులు.

ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు తగిన ఆధారాలు సహా హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. తీవ్రంగా గాలించిన అనంతరం పరారీలో ఉన్న ముస్తాక్​ను అదుపులోకి తీసుకున్నారు.

"దంపతులకు రోజూ గొడవ పడుతుండేవారు. సాహీనాకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం (extramarital affairs) ఉందని ముస్తాక్ అనుమానించేవాడు." అని పోలీసులు వెల్లడించారు.

ఇదీ చూడండి:భార్య జననాంగాన్ని కుట్టేసిన భర్త

ABOUT THE AUTHOR

...view details