పాకిస్థాన్‌కు రహస్య సమాచారం పంపిస్తున్న అనుమానిత గూఢచారిని (spy arrested in India) బెంగళూరులో అరెస్టు చేశారు. నిందితుడిని రాజస్థాన్‌కు (Rajasthan Pakistan spy) చెందిన జితెందర్ సింగ్‌గా గుర్తించారు.
బట్టలు విక్రయిస్తూ బెంగళూరులో జీవిస్తున్న జితెందర్.. నగరంలోని కీలక సంస్థలు, స్థావరాల గురించి పాకిస్థాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)కు సమాచారం పంపిస్తున్నాడు. బెంగళూరులోని దక్షిణ కమాండ్ మిలిటరీ ఇంటెలిజెన్స్, బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు సంయుక్త ఆపరేషన్ చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు. కాటన్‌పేట్‌లోని జాలీ మొహల్లా ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. (Pakistan spy arrested in Bangalore)
కరాచీ ఫేస్బుక్ ఖాతాకు..
నిందితుడు ఆర్మీ కమాండో యూనిఫాం ధరించి సైనిక స్థావరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేవాడని అధికారులు గుర్తించారు. రాజస్థాన్‌లోని బాడ్మేర్ మిలిటరీ స్టేషన్‌కు సంబంధించిన ఫొటోలు, అక్కడ ఉన్న వాహనాల గురించిన వివరాలను పాకిస్థాన్‌కు పంపించాడని తెలిపారు. నిందితుడి మొబైల్, సోషల్ మీడియా ఖాతాలపై నిఘా వేసి ఈ విషయాన్ని తెలుసుకున్నట్లు చెప్పారు.