తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెద్దలు బతకడానికి ఆ రాష్ట్రాలే బెటర్​! - పెద్దలకు మెరుగైన జీవన ప్రమాణాలు

రాజస్థాన్, హిమాచల్​ ప్రదేశ్​, మిజోరం సహా ఐదు ప్రాంతాల్లో పెద్దలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందుతున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఆర్థిక, సామాజిక స్థితులు సహా వైద్య వ్యవస్థ, ఆదాయ భద్రత అంశాలను పరిగణించి ఈ పరిశోధన చేపట్టినట్లు తెలుస్తోంది.

quality of life elderly in india
ఆ రాష్ట్రాల్లో పెద్దలకు మెరుగైన జీవన ప్రమాణాలు!

By

Published : Aug 12, 2021, 7:08 AM IST

దేశంలోని పెద్దలకు అందుతున్న జీవన ప్రమాణాలపై గురుగ్రామ్​కు చెందిన ఇన్​స్టిట్యూట్​ ఫర్​ కాంపిటీటివ్​నెస్ ఆసక్తికర విషయలను వెల్లడించింది. రాజస్థాన్​, హిమాచల్​ ప్రదేశ్​, మిజోరం రాష్ట్రాలు మెరుగైన జీవనప్రమాణాలు అందుతున్నట్లు పేర్కొంది. ఈ జాబితాలో ఛండీగఢ్​, హిమాచల్​ ప్రదేశ్​, మహారాష్ట్ర, బిహార్ మొదలైన రాష్ట్రాలు కూడా ఉన్నాయి.

ఈ పరిశోధన కోసం రాష్ట్రాలను పెద్దల జనాభా ఆధారంగా రెండు కేటగిరీలుగా విభజించింది. పెద్దల జనాభా 50 లక్షలు కంటే ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో రాజస్థాన్​ అగ్రస్థానం సంపాదించింది. ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, బిహార్​లు నిలిచాయి. ఈ విభాగంలో తెలంగాణ అట్టడుగు స్థానంలో నిలిచింది.

పెద్దల జనాభా.. 50లక్షల కంటే తక్కువ ఉన్న రాష్ట్రాల్లో హిమాచల్​ ప్రదేశ్​ తొలి స్థానంలో నిలిచింది. ఉత్తరాఖండ్​ రెండోస్థానం, హరియాణా మూడోస్థానం సంపాదించుకున్నాయి. గుజరాత్​ చివరి స్థానంతో సరిపెట్టుకుంది.

కేంద్ర పాలిత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల విభాగంలో చండీగఢ్​, మిజోరంలు అగ్రస్థానాలను సంపాదించుకున్నాయి. జమ్ముకశ్మీర్​, అరుణాచల్​ ప్రదేశ్​లు అట్టడుగు స్థానంలో నిలిచాయి.

ఆర్థిక, సామాజిక స్థితులు సహా వైద్య వ్యవస్థ, ఆదాయ భద్రత అంశాలను పరిగణించి ఈ పరిశోధన చేపట్టినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి :'ఆహారం వృథా చేయటం అంటే పేదలను దోచుకోవటమే'

ABOUT THE AUTHOR

...view details