తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రేప్​ కేసు దోషికి 15 రోజుల పెరోల్.. భార్యను గర్భవతిని చేసేందుకే! - భార్య గర్భవతిని చేసేందుకు ఖైదీకి పేరోల్​

తల్లి కావాలన్న భార్య కోరికను తీర్చేందుకు ఓ అత్యాచార కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న దోషికి 15 రోజుల పెరోల్​ మంజూరు చేసింది రాజస్థాన్​ హైకోర్టు. తీర్పు సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.

Man convicted for minor rape gets 15-day parole to get wife pregnant
Man convicted for minor rape gets 15-day parole to get wife pregnant

By

Published : Oct 16, 2022, 10:46 AM IST

సాధారణంగా కోర్టు.. ఖైదీలకు పెరోల్​ మంజూరు చేయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే.. తల్లి కావాలన్న భార్య కోరికను తీర్చేందుకు ఓ దోషికి పెరోల్​ మంజూరు చేసింది రాజస్థాన్ హైకోర్టు​. దోషి భార్య వేసిన పిటిషన్​ను పరిశీలించిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. మైనర్​ను అపహరించి అత్యాచారానికి పాల్పడిన కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న రాహల్(25)​ను విడుదల చేయాలని జస్టిస్​ సందీప్​ మెహతా, జస్టిస్​ సమీర్​ జైన్​తో కూడిన డివిజన్​ బెంచ్​ ఆదేశించింది. రూ.2 లక్షలతో వ్యక్తిగత పూచీకత్తు సహా రూ.లక్ష చొప్పున రెండు ష్యూరిటీ బాండ్లు సమర్పించాలని ఖైదీకి స్పష్టం చేసింది.

''దోషి భార్య తల్లి కావాలని కోరుకుంటోంది. తన భర్త లేకుండా, తన భర్త నుంచి ఎలాంటి పిల్లలు కలగకుండా ఉండే పరిస్థితుల్లో ఆమె జీవించకూడదు. ముఖ్యంగా ఆమె తన వంశ పరిరక్షణ కోసం ఈ పిటిషన్​ దాఖలు చేసింది. ఆ మహిళ పిటిషన్​ను తిరస్కరిస్తే ఆమె హక్కులను నిరాకరించినట్లే అవుతుంది. అందుకే.. దోషికి 15 రోజుల పెరోల్​ మంజూరు చేస్తున్నాం"

- రాజస్థాన్​ హైకోర్టు

గతంలోనూ రాజస్థాన్​ హైకోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ దోషి భార్య.. తల్లి కావాలన్న కోరికను తీర్చేందుకు అతడికి 15 రోజుల పెరోల్​ మంజూరు చేసింది. అమాయకురాలైన ఖైదీ భార్య వైవాహిక జీవితం ప్రభావితం కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు పేర్కొంది. ఏ మహిళ అయినా తల్లి అయినప్పుడే జీవితం పరిపూర్ణం అవుతుందని బెంచ్ ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసింది. 16 మతకర్మలలో బిడ్డను కనడం మహిళకు మొదటి హక్కు అని నొక్కిచెప్పింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details