తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో మార్కెట్లు, కార్యాలయాలు బంద్

కొవిడ్ వ్యాప్తి నిరోధానికి లాక్​డౌన్​ తరహా ఆంక్షలను అమలు చేస్తోంది రాజస్థాన్ ప్రభుత్వం. సోమవారం నుంచి మే 3 వరకు మార్కెట్లు, కార్యాలయాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. పాఠశాలలను కూడా మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

Rajasthan govt orders closure of offices, markets closed in Rajasthan till May 3
రాజస్థాన్ ప్రభుత్వం, కరోనా ఆంక్షలు

By

Published : Apr 19, 2021, 11:20 AM IST

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది రాజస్థాన్ ప్రభుత్వం. సోమవారం(ఏప్రిల్ 19) నుంచి మే 3 వరకు కార్యాలయాలు, మార్కెట్లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ 15 రోజులను 'ప్రజా క్రమశిక్షణ పక్షం'గా అభివర్ణించింది. ఈ సమయంలో నిత్యవసరాల దుకాణాలు మాత్రమే పనిచేస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

పండ్లు, కూరగాయల విక్రయాలను సాయంత్రం 7 గంటల వరకే అనుమతించనుంది ప్రభుత్వం. రాజస్థాన్​కు రావాలనుకునేవారు 72 గంటల్లోపు తీసుకున్న ఆర్​టీపీసీఆర్​ టెస్టు రిపోర్టును చూపించాలని స్పష్టం చేసింది.

విద్యాసంస్థలు బంద్..

ఆంక్షల్లో భాగంగా విద్యాసంస్థలను కూడా ఏప్రిల్ 30 వరకు మూసివేస్తున్నట్లు రాష్ట్ర సర్కారు వెల్లడించింది. ఉపాధ్యాయులు ఇంటి నుంచే పనిచేయాలని సూచించింది.

పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర కార్యక్రమాల్లో 50 మందికి మించి హాజరు కావొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంత్యక్రియలకు గరిష్ఠంగా 20 మందిని అనుమతిస్తోంది. సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్​లు, పార్కులను మూసివేయాలని ఇదివరకే ఆదేశించింది.

ఇదీ చూడండి:కరోనాతో జేడీయూ ఎమ్మెల్యే మృతి

ABOUT THE AUTHOR

...view details