Rajasthan Girl Gang Rape: రాజస్థాన్లోని భరత్పుర్లోని కోహ పోలీస్ స్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన జరిగింది. 13 ఏళ్ల బాలికపై 16 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ మేరకు నిందితులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు విచారణ ప్రారంభించాక నలుగురు నిందితులు లొంగిపోయారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఫిబ్రవరి 11న బాలిక కట్టెల కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను స్థానికంగా ఉన్న పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు.