తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఇంకెంత కాలం 'మాజీ'గా ఉంచుతారు?'.. కాంగ్రెస్‌ కీలక నేత వ్యాఖ్యలు - సచిన్​ పైలట్ రాజస్థాన్​

Sachin Pilot: రాజస్థాన్​ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్​ పైలట్​ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. శుక్రవారం రాత్రి కిసాన్​ సభలో పాల్గొన్న ఆయన 'ఇంకెంత కాలం నన్ను మాజీగా ఉంచుతారు?' అని రైతులను అడిగారు. దీంతో వెంటనే వారు.. 'పైలట్​ మేము నిన్ను అభిమానిస్తూనే ఉంటాం' అని పెద్ద ఎత్తున కేకలు పెట్టారు.

sachin pilot
sachin pilot

By

Published : Jun 12, 2022, 7:16 AM IST

Updated : Jun 12, 2022, 8:25 AM IST

Sachin Pilot: రాజస్థాన్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. "నన్నెంత కాలం మీరు మాజీగా ఉంచుతారు?" అని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం రాత్రి కిసాన్‌ సభలో పాల్గొన్న సచిన్‌ రైతులను ఉద్దేశించి మాట్లాడారు. "సోదరులారా? మాజీ స్పీకరు, మాజీ ఉప ముఖ్యమంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు ..ఇలా 'మాజీ'గా నన్ను ఎంత కాలం ఉంచుతారు ?" అని ప్రశ్నించారు. దీంతో సభకు హాజరైనవారు పెద్ద ఎత్తున కేకలు పెట్టారు.

"పైలట్‌.. మేం నిన్ను అభిమానిస్తాం" అని పేర్కొన్నారు. అదే సమయంలో పైలట్‌ అనుచరుడు, చాక్సు ఎమ్మెల్యే వేద్‌ ప్రకాశ్‌ సోలంకి మాట్లాడుతూ, "పైలట్‌ లావో, రాజస్థాన్‌ బచావో" అంటూ నినాదాలు చేశారు. "కాంగ్రెస్‌ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందన్న సంగతి ప్రజలకు తెలుసు. మేం అంతా పైలట్‌ వెంటే ఉంటాం. ఆయన పార్టీకి మిత్రుడు. ఎప్పుడు ఎలా మాట్లాడాలో స్పష్టంగా తెలిసిన వాడు" అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత పైలట్‌ మాట్లాడుతూ, "ప్రధాని మోదీ తూర్పు రాజస్థాన్‌ కెనాల్‌ ప్రాజెక్టుకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి. దానికి బడ్జెట్‌ కేటాయించి అది కార్యరూపం దాల్చేలా చూడాలి" అని డిమాండ్‌ చేశారు.

Last Updated : Jun 12, 2022, 8:25 AM IST

ABOUT THE AUTHOR

...view details