తెలంగాణ

telangana

ETV Bharat / bharat

5ఏళ్లలో 10లక్షల ఉద్యోగాలు, రాష్ట్రంలో పక్కాగా కులగణన- రాజస్థాన్​ ప్రజలపై కాంగ్రెస్​ హామీల వర్షం - రాజస్థాన్​ కాంగ్రెస్​ అసెంబ్లీ ఎన్నికలు 2023

Rajasthan Election 2023 Congress Manifesto : రాజస్థాన్‌లో మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కులగణన చేపడతామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగావకాశాలను కల్పిస్తామని ప్రకటించింది.

Rajasthan Election 2023 Congress Manifesto
Rajasthan Election 2023 Congress Manifesto

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2023, 11:51 AM IST

Updated : Nov 21, 2023, 12:24 PM IST

Rajasthan Election 2023 Congress Manifesto :అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజస్థాన్ ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్​ పార్టీ కీలక హామీలు కురిపించింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కులగణన చేపడతామని హామీ ఇచ్చింది. పంచాయతీ స్థాయిలో నియామకాల కోసం కొత్త వ్యవస్థను తీసుకొస్తామని తెలిపింది. రైతులకు రూ.2లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, స్వామినాథన్‌ కమిషన్‌ ప్రకారం కనీస మద్దతు ధర ఇస్తామని ప్రకటించింది. ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, అందులో ప్రభుత్వ రంగంలోనే 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించింది.

జయపురలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌, సీనియర్‌ నేత సచిన్‌ పైలట్‌ తదితరులు ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ ఇప్పటికే పలు గ్యారంటీలను ప్రకటించగా.. తాజాగా కులగణనను అందులో చేర్చింది. ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని మల్లికార్జున ఖర్గే తెలిపారు.

మేనిఫెస్టోలోని ఇతర ముఖ్య అంశాలివే..

  • ఉజ్వల లబ్ధిదారులకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌
  • మహిళలకు ఏడాదికి రూ.10వేల నగదు సాయం
  • ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛను విధానంపై చట్టం
  • రైతులకు రూ.2లక్షల వరకు వడ్డీలేని రుణాలు, పంటలకు కనీస మద్దతు ధర
  • ప్రభుత్వ కాలేజీలో చేరే విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు
  • చిరంజీవి మెడికల్‌ ఇన్స్యూరెన్స్‌ పథకం రూ.25లక్షల నుంచి రూ.50లక్షలకు పెంపు
  • ప్రకృతి విపత్తులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు రూ.15లక్షల వరకు బీమా పథకం

రూ.30 లక్షల కోట్లకు ఆర్థిక వ్యవస్థ!
రాజస్థాన్​ ఆర్థిక వ్యవస్థ.. 15 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ తెలిపారు. 2030 కల్లా జీడీపీని 30 లక్షల కోట్ల రూపాయలకు చేరుస్తామని చెప్పారు. ఆర్థిక వ్యవస్థను తాము నిర్వహిస్తున్న తీరును చూసి రాష్ట్ర ప్రజలు గర్విస్తున్నారన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం 46.48 శాతం పెరిగిందని వెల్లడించారు.

200 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న రాజస్థాన్‌లో నవంబరు 25వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 23 వరకు ప్రచారానికి గడువు ఉంది. ఈ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్‌, బీజేపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ తమ మేనిఫెస్టోను ప్రకటించింది.

Rajasthan Elections 2023 : రాజస్థాన్​లో సెంటిమెంట్​ రిపీట్​ అవుతుందా? లేక కాంగ్రెస్​కే జై కొడతారా?

Rajasthan Congress Vs BJP : కాంగ్రెస్​పై యువత, మహిళల అసంతృప్తి.. BJPకి లాభం చేకూర్చేనా? మేవాడ్ ఎవరి పక్షం?

Rajasthan Elections Key Points : మోదీ Vs గహ్లోత్​?.. ఈ 5 అంశాలు ఎవరికి కలిసొస్తే వారిదే పీఠం!

Last Updated : Nov 21, 2023, 12:24 PM IST

ABOUT THE AUTHOR

...view details