రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్(ashok gehlot news) అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పిగా ఉన్న క్రమంలో జైపుర్లోని ఎస్ఎంఎస్ ఆసుపత్రిలో చేరినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ఆసుపత్రిలో చేరిన తర్వాత.. ఆయనకు రక్తనాళాల పరీక్ష (యాంజియోప్లాస్టీ) విజయవంతంగా నిర్వహించినట్లు ప్రత్యేక అధికారి లోకేశ్ శర్మ తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెప్పారు.
" కొవిడ్ నుంచి కోలుకున్నాక పలు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. నిన్నటి నుంచి ఛాతిలో తీవ్రంగా నొప్పి వచ్చింది. ఇప్పుడే ఎస్ఎంఎస్ ఆసుపత్రిలో సీటీ ఎన్జీఓ పరీక్షలు చేశారు. నేను ఆరోగ్యంగానే ఉన్నా. త్వరలోనే తిరిగి వస్తా. మీ ఆశీర్వాదాలు నాతో ఉన్నాయి. "