రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌కు వింత అనుభవం ఎదురైంది. టీచర్ల పదవి బదిలీకి సంబంధించి అవినీతి జరుతోందా అని అడిగిన ప్రశ్నకు అక్కడి వారు ముక్తకంఠంతో అవును అంటూ సమాధానం చెప్పారు. దీంతో విస్తుపోయిన సీఎం.. ఇలా జరగడం దురదృష్టకరమని అని దీనిపై తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. జైపుర్‌లో రాష్ట్రస్థాయి టీచర్ల సన్మాన కార్యక్రమంలో మంగళవారం ఈ ఘటన జరిగింది.
'అవును.. లంచం ఇచ్చాం'.. సీఎం ముందే ఒప్పుకున్న ఉద్యోగులు! కప్పు టీ అడిగినా చెప్పండి..
అనంతరం దీనిపై స్పందించిన విద్యాశాఖ మంత్రి.. ట్రాన్సఫర్ల కోసం తన స్టాఫ్‌లో ఎవరైనా కప్పు టీ అడిగినా తనకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ తరహా అవినీతిని నిర్మూలించేందుకే సంస్కరణలు చేపట్టే దిశగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి :ప్రవచనాలు చెబుతూనే ప్రాణం వదిలిన స్వామీజీ.. పుట్టిన రోజు నాడే...