రాజస్థాన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా.. 15మంది ఎమ్మెల్యేలు ఆదివారం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు(rajasthan cabinet reshuffle). జైపుర్లోని రాజ్భవన్లో గవర్నర్ కల్రాజ్ మిశ్రా.. వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో 11మంది కేబినెట్ మంత్రులు కాగా.. నలుగురు సహాయ మంత్రులు.
కొత్త మంత్రివర్గంలో ఎస్సీ వర్గం నుంచి నలుగురికీ, ఎస్టీ సామాజిక వర్గం నుంచి ముగ్గురికి అవకాశం దక్కింది(rajasthan cabinet news).
శనివారం.. సీఎం అశోక్ గహ్లోత్ కేబినెట్ మొత్తం రాజీనామా చేసింది. కాగా.. వారిలో ముగ్గురిని మాత్రమే పక్కనపెట్టి, మిగిలిన మంత్రులు ఆదివారం తిరిగి ప్రమాణం చేశారు. మొత్తం మీద గహ్లోత్ కేబినెట్లో మంత్రుల సంఖ్య 30కి చేరింది.