రాజస్థాన్ ఉదయ్‌పుర్ జిల్లాలో.. ఎలాంటి వైద్య శిక్షణ లేకుండానే ఓ అంబులెన్స్ డ్రైవర్ ప్రజలకు కరోనా టీకాలను వేశాడు. చివరికి విషయం తెలుసుకున్న అధికారులు అతన్ని విధుల నుంచి తొలగించారు.
మహేంద్ర లొహార్ స్థానికంగా ఉన్న సైరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కరోనా టీకాలను స్థానికులకు వేసే సమయంలో వైద్య సిబ్బందితో పాటు లొహార్ సైతం టీకాలను వేశాడు. భయాందోళన చెందిన ప్రజలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా.. విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం అతన్ని విధుల నుంచి తొలగించారు.