తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Rajasthan Accident News : ఒకే కుటుంబంలోని ఏడుగురు మృతి.. ఫంక్షన్​ నుంచి వస్తుండగా..

Rajasthan Accident News : కారును లారీ ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్​లో జరిగిందీ ప్రమాదం.

Rajasthan Accident News
Rajasthan Accident News

By ETV Bharat Telugu Team

Published : Oct 29, 2023, 8:47 AM IST

Updated : Oct 29, 2023, 10:45 AM IST

Rajasthan Accident News :రాజస్థాన్​లోని హనుమాన్​గఢ్​ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. మరో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఓవర్​టేక్​ చేయబోయి ఓ కారును లారీ ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని నౌరంగ్‌దేశర్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఓవర్​టేక్​ చేసే ప్రయత్నంలో లారీ.. బలంగా కారును ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న ఏడుగురు ఏడుగురు మరణించారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు చిన్నారులను ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్​ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీరంతా ఓ ఫంక్షన్​కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.

ఎంపీ హనుమాన్ బేనివాల్ సంతాపం
ఈ ఘటనపై ఎంపీ హనుమాన్ బేనివాల్ విచారం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా భగవంతుడిని ప్రార్థించారు.

ఆరుగురు కూలీలు మృతి..
బంగాల్​లోని ఖరగ్​పుర్​ సమీపంలో శనివారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో ఆరుగురు కూలీలు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పికప్​ వ్యాన్​లో పువ్వులు లోడ్​ చేస్తుండగా సిమెంట్​ లారీ ఢీకొట్టడం వల్ల ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పశ్చిమ మేదినీపుర్​ జిల్లా.. ఖరగ్​పుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని బురమలా వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను రక్షించి తదుపరి చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం మిడ్నాపుర్ ఆస్పత్రికి తరలించారు.

"శనివారం ఉదయం కార్మికులు.. పికప్​ వ్యాన్​లో పూలు లోడింగ్​ చేస్తున్నారు. ఆ సమయంలో 10-12 మంది కార్మికులు.. పువ్వులు లోడ్​ చేసే పనిలో నిమగ్నమయ్యారు. అకస్మాత్తుగా సిమెంట్​ లారీ వెనుక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఒకరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించారు" అని పోలీసులు తెలిపారు.

Karnataka Accident Today :​ లారీని ఢీకొన్న టాటా సుమో.. 13 మంది ఏపీ వాసులు మృతి

Tamil Nadu Road Accident : బస్సును ఢీకొట్టిన టాటా సుమో.. ఏడుగురు భక్తులు దుర్మరణం.. దర్శనానికి వెళ్లి వస్తుండగా..

Last Updated : Oct 29, 2023, 10:45 AM IST

ABOUT THE AUTHOR

...view details