తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Rajasthan 100 Private Lockers : '100 లాకర్లలో రూ.500కోట్ల బ్లాక్ మనీ, 50కిలోల బంగారం'.. ఎంపీ సంచలన ఆరోపణలు - rajasthan elections kirdoilal meena

Rajasthan 100 Private Lockers : రాజస్థాన్​లోని ఓ భవనంలో 100 ప్రైవేటు లాకర్లలో రూ.500 కోట్ల నల్లధనం, 50 కేజీల బంగారం ఉన్నట్టు బీజేపీ ఎంపీ కిరోడిలాల్‌ మీనా ఆరోపించారు. త్వరలో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఆయన ఆరోపణలు సంచలనంగా మారాయి.

Rajasthan 100 Private Lockers
Rajasthan 100 Private Lockers

By ETV Bharat Telugu Team

Published : Oct 13, 2023, 5:32 PM IST

Rajasthan 100 Private Lockers : దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగడం వల్ల ఆయా రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కాయి. రాజస్థాన్​ రాజధాని జైపుర్​లోని ఓ భవనంలో 100 ప్రైవేటు లాకర్లలో రూ.500 కోట్ల నల్లధనంతో పాటు 50 కిలోల బంగారం దాచి ఉంచారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కిరోడి లాల్​ మీనా ఆరోపించారు. పోలీసులే వచ్చి వాటిని తెరవాలని ఆయన డిమాండ్‌ చేశారు. దీంతో ఆయన ఆరోపణలు సంచలనంగా మారాయి.

మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ ఎంపీ కిరోడి లాల్​ మీనా

100 Private Lockers In Rajasthan : అయితే ఆ లాకర్లు ఎవరికి చెందినవనే వివరాలను మాత్రం కిరోడి లాల్​ మీనా బయటపెట్టలేదు. పోలీసులు వచ్చి లాకర్లను తెరిచే వరకు తాను అక్కడే కూర్చొని ఉంటానని ఆయన తెలిపారు. లాకర్లు ఉన్న భవనం వద్దకు తనతో కలిసి రావాలని మీడియా ప్రతినిధులను కోరారు. పోలీసులే వచ్చి ఈ లాకర్లను తెరవాలని డిమాండ్‌ చేశారు. ఈ లాకర్లు ఎవరివనే వివరాలను ఇప్పుడే బయట పెడితే.. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఆ లాకర్లు తెరవనివ్వరని ఆయన తెలిపారు. జైపుర్‌ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా పైవిధంగా వ్యాఖ్యలు చేశారు. నవంబర్‌లో జరగనున్న రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కిరోడిలాల్‌ మీనా సవాయి మాధోపుర్‌ నుంచి బరిలో ఉన్నారు.

పోలింగ్​ ఎప్పుడంటే?
Rajasthan Election 2023 : అయితే రాజస్థాన్​లో ఎన్నికల పోలింగ్​ తేదీని మార్చుతున్నట్లు ఇటీవలే ఎన్నికల అధికారులు ప్రకటించారు. నవంబరు 23న జరగాల్సిన పోలింగ్​ను అదే నెల 25వ తేదీన నిర్వహిస్తామని వెల్లడించారు. నవంబరు 23వ తేదీన రాజస్థాన్​లో దేవ్​ ఉథాని ఏకాదశి సందర్భంగా పెద్ద ఎత్తున వివాహాలు జరగనున్నాయి. దీంతో ఓటింగ్​పై భారీగా ప్రభావం పడుతుందని పలు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు పోలింగ్​ తేదీని మార్చాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాయి. దీంతో ఎన్నికల సంఘం.. పోలింగ్​ డేట్​ను మార్చుతున్నట్లు ప్రకటించింది.

Rajasthan Election Schedule :రాజస్థాన్ ఎన్నికల షెడ్యూల్ ఇదే..

  • నోటిఫికేషన్ విడుదల తేదీ: అక్టోబర్ 30
  • నామినేషన్ల స్వీకరణకు తుది గడువు: నవంబర్ 6
  • నామినేషన్ల పరిశీలన: నవంబర్ 7
  • నామినేషన్ల ఉపసంహరణ గడువు: నవంబర్ 9
  • రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ: నవంబర్ 25
  • రాజస్థాన్ ఎన్నికల ఫలితాల తేదీ: డిసెంబర్ 3
  • మొత్తం ఓటర్లు: 5.25 కోట్లు. కౌంటింగ్​ యథావిథిగా డిసెంబర్​ 3న జరగనున్నట్లు తెలిపారు. ముందు అనుకున్న తేదీన పెద్ద ఎత్తున వివాహాలు ఉండడమే పోలింగ్​ తేదీని మార్చామని చెప్పారు.

BJP Candidate List 2023 Assembly Election : బీజేపీ నయా ప్లాన్​.. అసెంబ్లీ ఎన్నికల బరిలో 18 మంది ఎంపీలు

Rajasthan Elections 2023 : రాజస్థాన్​లో సెంటిమెంట్​ రిపీట్​ అవుతుందా? లేక కాంగ్రెస్​కే జై కొడతారా?

ABOUT THE AUTHOR

...view details