తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెళ్లైన 6నెలలకే కొడుకు మృతి.. కోడలికి అత్త రెండో పెళ్లి - కోడలికి అత్త రెండో పెళ్లి

Rajastan woman kanyadan: ఇంట్లో అడుగుపెట్టిన కోడలిని కన్నకూతురి కంటే ఎక్కువగా చూసుకునే అత్తలు చాలా అరుదు. అలాంటిది కొడుకు మరణిస్తే.. కోడలికి రెండో పెళ్లి జరిపించేవారు ఉంటారంటే ఆశ్చర్యం కలగక మానదు. రాజస్థాన్​లోని సికార్​ ప్రాంతానికి చెందిన కమలా దేవి.. తన కోడలికి ఇలాగే చేశారు. జీవితంలో స్థిరపడేలా ప్రోత్సహించి.. ఘనంగా మరోపెళ్లి చేశారు.

rajastan woman kanyadan
rajastan woman kanyadan

By

Published : Jan 27, 2022, 12:51 PM IST

Rajastan woman kanyadan: అత్తా- కోడళ్లు అనగానే.. వారి మధ్య గొడవలు.. ఇంట్లో ఆధిపత్య పోరు.. ఇవే గుర్తొస్తాయి. ఇంటికి వచ్చే కోడలిని కూతురిలా చూసుకునే అత్తల గురించి చాలా అరుదుగా వింటుంటాం. అయితే, ఇప్పుడు మనం చదువుతున్న మహిళ మాత్రం.. అంతకుమించి! తన కొడుకు చనిపోతే.. కోడలిని పుట్టింటికి పంపించకుండా సొంత బిడ్డలా చూసుకుంది. చదివించి.. జీవితంలో నిలదొక్కుకునేలా చేసి రెండో వివాహం చేయించింది.

Second marriage to daughter in law

రాజస్థాన్​లోని సికార్ జిల్లాలో నివసించే కమలా దేవి, దిలావర్ దంపతులకు శుభం అనే ఓ కుమారుడు ఉండేవారు. 2016 మే 25న సునీత అనే అమ్మాయితో తన కుమారుడి వివాహం జరిపించింది కమల. పెళ్లి తర్వాత శుభం.. ఎంబీబీఎస్ చదివేందుకు కిర్గిస్థాన్​కు వెళ్లారు. 2016 నవంబర్​లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు.

అయితే, కుమారుడి మృతి తర్వాత కోడలిని దూరం చేసుకోలేదు కమలా దేవి. తన ఇంట్లోనే ఉంచుకొని.. జీవితంలో నిలదొక్కుకునేలా వెన్నంటి ప్రోత్సాహం అందించింది. అత్త సహకారంతో చదువు కొనసాగించిన సునీత.. గ్రేడ్-1 లెక్చరర్ ఉద్యోగం సంపాదించింది. జీవితంలో తనకాళ్లపై తాను నిలబడేలా ఎదిగింది. దీంతో సునీతకు దగ్గరుండి రెండో వివాహం చేయించారు కమలా దేవి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:ఒంట్లో బంగారం ముద్దలు.. కొరియర్ బ్యాగ్​లో 5.3 కోట్ల హెరాయిన్

ABOUT THE AUTHOR

...view details