తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉత్తర భారతంలో వర్షాలు.. ఉత్తరాఖండ్​లో రెడ్​ అలర్ట్​ - north india rain news

దిల్లీ సహా పలు ఉత్తర భారత ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి(north india rain news ). దీంతో అనేక ప్రాంతాల్లో రోడ్లు నీటమునిగాయి. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు(delhi rain news). ఉత్తరాఖండ్​లోని చమోలిలో అధికారులు రెడ్​ అలర్ట్​ జారీ చేశారు.

north india rain news
ఉత్తర భారతంలో వర్షాలు.. హిమాచల్​ప్రదేశ్​​లో రెడ్​ అలర్ట్​

By

Published : Oct 18, 2021, 9:06 AM IST

అకాల వర్షాలకు ఉత్తరభారతం తడిసిముద్దయ్యింది. దిల్లీ, ఉత్తర్​ప్రదేశ్​తో పాటు ఇతర ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. దీంతో ప్రజలు ఎన్నో విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దిల్లీలోని పలు ప్రాంతాల్లో రోడ్లు నీటమునిగాయి. గాజిపుర్​ పండ్ల మార్కెట్​లో నీరు నిలిచిపోయింది. పండ్లు, కూరగాయలు తడిసిపోయాయి.

దిల్లీ పండ్ల మార్కెట్​లో పరిస్థితి..
దిల్లీలోని మార్కెట్​లో ఇలా..

ఉత్తర్​ప్రదేశ్​లోని అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.

ఉత్తర్​ప్రదేశ్​లోని ఓ వీధి
ఉత్తర్​ప్రదేశ్​లోని ఓ వీధి..

ఉత్తరాఖండ్​లోని చమోలీ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న కారణంగా అధికారులు రెడ్​ అలర్ట్​ జారీ చేశారు. ముందస్తు జాగ్రత్తగా బద్రినాథ్​ యాత్రను నిలిపివేశారు.

ఉత్తరాఖండ్​ చమోలీ

జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​, హిమాచల్​ప్రదేశ్​, ఉత్తరాఖండ్​, పంజాబ్​, హరియాణా, ఛండీగఢ్​, దిల్లీ, ఉత్తర్​ప్రదేశ్​, ఉత్తర రాజస్థాన్​, ఉత్తర మధ్యప్రదశ్​, బంగాల్​లో మరో 24గంటల వరకు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణశాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది(north india rain forecast).

ఇదీ చూడండి:-వరుణుడి ప్రకోపం.. కన్నీటి సంద్రమైన కేరళ

ABOUT THE AUTHOR

...view details