భారీ వర్షాలకు ఉత్తరాది నగరాలు అతలాకుతలం దిల్లీలో ఆదివారం ఉదయం నుంచి కుండపోతగా కురిసిన వర్షానికి జనజీవనం అతలాకుతలం అయ్యింది. 24 గంటల్లోనే దిల్లీలో 28 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. వచ్చే రెండు రోజుల్లో మరింత తీవ్రతతో వర్షాలు కురుస్తాయని అంచనావేసింది. కాగా, దిల్లీలో ఉష్ణోగ్రత 26డిగ్రీలకు పడిపోయింది.
వాన ధాటికి ప్రధాన రహదారులన్నీ నీటితో నిండిపోగా.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు
ఖాన్పుర్లో వానహచోదకుల పాట్లు దిల్లీలోని ఖాన్పుర్లో వరద ఉద్ధృతికి వాహనాలు సగం నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో ఫుట్పాత్లు ధ్వంసమయ్యాయి.
ఖాన్పుర్లో రాకపోకలకు తిప్పలు యుమునా బజార్లో మోకాళ్ల లోతు వరద పారుతోంది.
యమునా బజార్ వద్ద వరద బీభత్సం ప్రహ్లాద్పుర్ ప్రాంతంలోని అండర్పాస్ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.
ప్రహ్లాద్పుర్లో నీటమునిగిన అండర్పాస్ భారీ వరదలకు యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఓల్డ్ యమునా బ్రిడ్జ్ వద్ద నీటి మట్టం ప్రమాదస్థాయికి చేరింది.
యుమునా నదిలో ప్రమాదకరంగా నీటి ప్రవాహం రాజస్థాన్ అజ్మేర్ వీధుల్లో వరద ఏరులై పారుతోంది. పలు ప్రాంతంలో ఇళ్లు నీటమునిగి, ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది.
అజ్మేర్ వీధుల్లో వరద ప్రవాహం అజ్మేర్లో వీధులన్నీ జలమయం ఇదీ చూడండి: కఠినంగా లాక్డౌన్ అమలు- బోసిపోయిన రోడ్లు