తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వరుణుడి బీభత్సానికి మహా నగరాలు గజగజ - మహా నగరాల్లో వరదలు

ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు దిల్లీ, ముంబయి సహా పలు మహా నగరాల్లో జన జీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలకు ధాటికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నివాస ప్రాంతాల్లోకి బురదతో కూడిన వరద ప్రవేశిస్తోంది. కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

heavy rain
భారీ వర్షాలు

By

Published : Jul 19, 2021, 5:56 PM IST

దేశంలో పలు రాష్ట్రాలు వరదల ధాటికి చిగురుటాకులా వణుకుతున్నాయి. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్​ సహా దిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. వరదతోపాటు బురద ఇళ్లలోకి ప్రవేశిస్తోంది. చెట్లు, విద్యుత్​ స్తంభాలు నేలకూలాయి. కొన్నిచోట్ల విద్యుత్​ సరఫరా నిలిచిపోగా.. మరొకొన్ని ప్రదేశాల్లో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

వరద ధాటికి చెరువును తలపిస్తున్న వీధులు
వరద నీటిలో చిక్కుకున్న వాహనాలు

భారీ వర్షపాతం

మహారాష్ట్రలోని ఠాణె, రాయిగఢ్​, పాల్ఘడ్​ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఠాణెలో ఆదివారం రాత్రి 151.33 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. పాల్ఘఢ్​ జిల్లాలో 108.67 మిల్లీమీటర్ల, రాయిగఢ్​ జిల్లాలో సగటున 186.51మిల్లీ మీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది.

వరద నీటిలో మునిగిన బస్సు
భారీగా నిలిచిన వరద నీరు

ఠాణెలో వర్షాల ధాటికి ఓ బాలుడు చనిపోగా.. నివాస భవనాలపై చెట్టు విరిగిపడటం వల్ల 40 ఏళ్ల వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు పాల్ఘడ్ జిల్లాలో వాసయి ప్రాంతంలో 80 గ్యాస్​ సిలిండర్లు కొట్టుకుపోగా.. వాటిని పోలీసుల సాయంతో సురక్షిత ప్రాంతానికి చేర్చారు.

ముంబయి నగరంలో వరదల కారణంగా స్థానిక రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

రాకపోకలకు అంతరాయం

దేశ రాజధానిలో 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొన్నిచోట్ల వాన నీరు నిలిచిపోయి.. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరో రోజు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. భారీ గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

భారీగా నిలిచిన ట్రాఫిక్​
భారీ ట్రాఫిక్​తో ఇబ్బంది పడుతున్న వాహనదారులు

ఇళ్లలోకి వరద నీరు

ఉత్తరాఖండ్​ తెహ్రీ గఢ్​వాల్​ జిల్లాలో వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించింది. పంటలు ధ్వంసమయ్యాయి. వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.

వరద నీటిలో కొట్టుకు వస్తున్న బురద

ఇదీ చూడండి:హెచ్చరికలు పట్టించుకోకుండా వెళ్లారు.. చివరకు..

ABOUT THE AUTHOR

...view details