ఆగస్టులో వర్షపాతం భారీ లోటును నమోదు చేసింది. దేశంలో సుమారు 24 శాతం మేర వానలు (Rainfall in India) తగ్గినట్లు భారత వాతావరణ శాఖ (Rainfall Imd) పేర్కొంది. అంతేకాకుండా.. గత 12 ఏళ్లలో ఇదే అత్యల్పమని తెలిపింది.
''దేశంలో ఆగస్టు నెలలో తక్కువ వర్షపాతం నమోదైంది. ఇది దీర్ఘకాలిక సగటు కంటే 24 శాతం తక్కువ. 2009 తర్వాత ఇదే అత్యల్పం.''
-భారత వాతావరణ శాఖ
అయితే తొలుతగా భారత వాతావరణ శాఖ ఇచ్చిన దాని ప్రకారం 19 ఏళ్లలో అత్యల్ప వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. కానీ తరువాత దానిని సవరించింది. నైరుతి రుతుపవనాల సీజన్ జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఉంటుంది. అయితే జూన్ నెలలో 10 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. కానీ జులై, ఆగస్టు నెలల్లో వరుసగా 7, 24 శాతం లోటును నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:మహా విషాదం.. మలబార్ వీరుల 'వ్యాగన్ ట్రాజెడీ'కి వందేళ్లు