వర్షాకాలం రెండో అర్ధభాగంలో వానలు భారీగానే కురవనున్నాయి. ఆగస్టు-సెప్టెంబర్ మధ్య వర్షపాతం సాధారణం కంటే అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది.
ద్వీపకల్ప భూభాగం, మధ్య భారతంలో వర్షపాతం సాధారణం కంటే అధికంగా ఉంటుందని ఐఎండీ లెక్కగట్టింది. తూర్పు, ఉత్తర, ఈశాన్య భారతదేశంలో మాత్రం సాధారణం లేదా సాధారణం కన్నా తక్కువ వర్షపాతం ఉంటుందని వివరించింది.
ఈ ఏడాది నుంచి నెలవారీ అంచనాలను సైతం వెలువరిస్తున్న ఐఎండీ.. ఆగస్టులో రుతుపవనాలు సాధారణంగానే ఉంటాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఈ నెలలో సగటున 94-106 శాతం వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.