తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్'​తో ప్రాణవాయువు కొరతకు చెక్​ - ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్ న్యూస్

ఆక్సిజన్ కొరత తీర్చేందుకు రైల్వే శాఖ ముందుకొచ్చింది. మెడికల్ ఆక్సిజన్​ను దేశవ్యాప్తంగా సరఫరా చేసేందుకు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. ఈ రైళ్లకు ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్​గా నామకరణం చేసింది.

railway oxyzen express
'ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్'​లను నడపనున్న రైల్వే

By

Published : Apr 18, 2021, 7:40 PM IST

కరోనా ఉద్ధృతితో దేశంలో ఆక్సిజన్‌కు తీవ్ర డిమాండ్‌ ఏర్పడిన వేళ.. రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవరూప మెడికల్ ఆక్సిజన్‌, ఆక్సిజన్‌ సిలిండర్ల సరఫరాకు రాబోయే రోజుల్లో దేశ వ్యాప్తంగా ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది.

'ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌'గా పిలిచే ఈ రైలు.. ఉత్పత్తి కేంద్రాల నుంచి ఆక్సిజన్​ను సేకరిస్తుందని రైల్వే శాఖ తెలిపింది. ఖాళీ ట్యాంకులతో ఉన్న రైలు సోమవారం ముంబయి నుంచి బయలుదేరి విశాఖపట్నం, భిలాయ్‌, జంశెద్​పుర్, రాఉర్కెలా, బొకారోలో ఉన్న ఉత్పత్తి కేంద్రాల నుంచి ఆక్సిజన్‌ను సేకరిస్తుంది.

రైళ్లు ఆక్సిజన్‌ను సేకరించిన తర్వాత డిమాండ్‌ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు సరఫరా చేస్తామని రైల్వే శాఖ వెల్లడించింది. ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ సాఫీగా ప్రయాణం సాగించేలా హరిత కారిడార్‌ను సృష్టిస్తామని తెలిపింది.

ఇదీ చదవండి:ఆ రాష్ట్రాలకు వెళ్తే.. ఈ ఆంక్షలు పాటించాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details