తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైళ్లలో రాత్రిళ్లు ఛార్జింగ్ ఇక బంద్​ - రైళ్లలో అగ్ని ప్రమాదాలు

రైళ్లలో అగ్ని ప్రమాదాలను నిరోధించేందుకు రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 11గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు ఎలక్ట్రానిక్​ పరికరాల ఛార్జింగ్​ను నిషేధించింది.

trains
రైళ్లలో రాత్రిళ్లు ఛార్జింగ్ ఇక బంద్​

By

Published : Mar 31, 2021, 5:53 AM IST

అగ్ని ప్రమాదాలను నిరోధించే చర్యల్లో భాగంగా రైళ్లలో రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల మధ్య ఎలక్ట్రానిక్ పరికరాల ఛార్జింగ్కు అవకాశం ఇవ్వకూడదని రైల్వేశాఖ నిర్ణయించింది. ఆ సమయంలో ఛార్జింగ్ పాయింట్లు పనిచేయకుండా పశ్చిమ రైల్వే రెండు వారాల క్రితమే మార్పులు చేసింది.

నిజానికి రాత్రిపూట ఛార్జింగ్ కు వీల్లేకుండా చేయాలని 2014లోనే రైల్వే భద్రత కమిషనర్ ఆదేశించారని ఒకరు వెల్లడించారు. దానిపై రైల్వేబోర్డు తాజాగా అన్ని జోన్లకు మరోసారి ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు. ఎలక్ట్రానిక్ పరికరాలను అవసరానికి మించి చార్జింగ్ చేస్తుండడం వల్ల అనేకసార్లు స్వల్పస్థాయిలోనైనా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.

ఇదీ చూడండి:దిల్లీ ఆస్పత్రులలో కరోనా రోగులకు పడకలు రిజర్వ్​

ABOUT THE AUTHOR

...view details