రైళ్లలో సిగరెట్, బీడీలు తాగడం, మండే స్వభావం ఉన్న వస్తువులను వెంట తీసుకెళ్లేవారికి భారీగా శిక్షలు విధించనుంది రైల్వే శాఖ. ఈ నేరానికి మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.వెయ్యి జరిమానా లేదా రెండూ పడనుంది. దాంతో పాటు మరో రూ.500 జరిమానా విధించనుంది.
ఇటీవల జరిగినశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఎస్-5 బోగీ మంటల్లో చిక్కుకోవడానికి సిగరెట్ లేదా బీడీ కారణమని ప్రాథమిక నివేదికలు పేర్కొంటున్న నేపథ్యంలో రైల్వే శాఖ ఆ దిశగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
7 రోజుల అవగాహన కార్యక్రమం..