కదులుతున్న రైలులో ప్రయాణికురాలి(33)పై సామూహిక అత్యాచారం జరిగింది. మరో వ్యక్తితో కలిసి రైల్వే టీటీఈ ఈ దారుణానికి పాల్పడ్డాడు. మొదట మహిళను ఏసీ కోచ్‌లోకి పంపించిన టీటీఈ.. అనంతరం తన సహచరునితో కలిసి అఘాయిత్యం చేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
ప్రయాణికురాలిపై టీటీఈ అత్యాచారం.. కదులుతున్న రైలులో మరో వ్యక్తితో కలిసి.. - Gang rape of passenger in train
ప్రయాణికురాలిపై అత్యాచారం చేశాడు రైల్వే టీటీఈ. కదులుతున్న రైలులో మరోవ్యక్తితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ దారుణం జరిగింది. మరోవైపు కోతుల కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మేడపై నుంచి జారి పడి చనిపోయాడు. ఇదీ ఉత్తర్‌ప్రదేశ్‌లోనే జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుబేదార్‌గంజ్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ దారుణం జరిగింది. నిందితుడిని రాజు సింగ్‌గా పోలీసులు గుర్తించారు. ఘటనపై బాధితురాలు శనివారం.. పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాజు సింగ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. మరొక నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు.
వ్యక్తి ప్రాణం తీసిన కోతులు:
కోతుల కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మేడపై నుంచి జారి పడి చనిపోయాడు. కోతుల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఇలా చనిపోయాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ విషాదకర ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే.. అలీగఢ్ జిల్లాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మృతుడిని 50 ఏళ్ల మజీద్గా గుర్తించారు. మేడపైన పిల్లలు ఆడుకుంటూ ఉండగా దాదాపు 20కి పైగా కోతులు వారిపై దాడి చేయబోయాయి. దీంతో మజీద్ ఓ కర్రతో కోతులను బెదిరించే ప్రయత్నం చేశాడు. అనంతరం ఆగ్రహంతో కోతులన్ని ఒక్కసారిగా మజీద్ మీదకు వచ్చాయి. వాటిని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మజీద్ పైనుంచి పడిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ మజీద్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చాలా రోజుల నుంచి ఈ ప్రాంతంలో కోతుల బెడద ఎక్కువగా ఉంటుందంటున్నారు స్థానికులు. వాటి నుంచి రక్షణ కల్పించాలని ప్రజా పతినిధులను కోరుతున్నారు.