తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరో రెండు నెలల్లో పూర్తిస్థాయిలో రైళ్లు!

వచ్చే రెండు నెలల్లో దేశంలో పూర్తిస్థాయి(కొవిడ్​కు ముందున్న పరిస్థితి మాదిరిగా) రైళ్ల రాకపోకలను పునురుద్ధరించే అవకాశం ఉంది. అయితే.. అవి కూడా ప్రత్యేక రైళ్లుగానే నడవనున్నాయి. ఈ మేరకు సంబంధిత వర్గాలు గురువారం తెలిపాయి.

trains
రెండు నెలల్లో పూర్తిస్థాయిలో రైళ్లు!

By

Published : Apr 2, 2021, 7:07 AM IST

దేశంలో రైళ్ల రాకపోకలను వచ్చే 2 నెలల్లో పూర్తిస్థాయిలో (కొవిడ్​కు ముందున్న పరిస్థితి మాదిరిగా) పునరుద్ధరించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు గురువారం తెలిపాయి. అయితే అవి కూడా ప్రత్యేక రైళ్లుగానే నడిచే అవకాశం ఉన్నట్లు వెల్లడించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 66 శాతం రైళ్లను 'స్పెషల్ ట్రెయిన్లు'గా నడుపుతున్నారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఛార్జీలు కొంత ఎక్కువగా ఉండటం సహా వివిధ వర్గాలకు రాయితీలు ఉండవు. కరోనా కారణంగా గత ఏడాది మార్చిలో అన్ని రైలు సర్వీసులను నిలిపివేశారు. అనంతరం మే నుంచి దశల వారీగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు.

ప్రస్తుతం ప్రత్యేక రైళ్ల రూపంలో 77 శాతం మెయిల్, ఎక్స్ ప్రెస్ ట్రెయిన్లు, 91 శాతం సబర్బన్ రైళ్లు నడుపుతున్నారు. ప్యాసింజర్ రైళ్లు మాత్రం 20 శాతమే నడుస్తున్నాయి. కొవిడ్ రాకముందు రోజుకు 1,768 మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లు.. 3,634 ప్యాసింజర్లు.. 5,881 సబర్బన్ రైళ్లు నడిచేవి.

ఇదీ చూడండి:దేశంలో 6.75 కోట్ల కరోనా టీకా డోసుల పంపిణీ

ABOUT THE AUTHOR

...view details