సర్వీస్ ఛార్జీలపై భారతీయ రైల్వే మాయాజాలం చేసింది. ప్రీమియం రైళ్లలో ఆహారంపై విధించే ఆన్‌బోర్డ్ సర్వీస్ ఛార్జీని రద్దు చేసింది. ప్రస్తుతం.. ముందస్తుగా ఆర్డర్ చేయని ఆహార పదార్థాలకు సైతం రూ.50 సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తుండగా.. ఇప్పుడు ఆ పద్ధతికి స్వస్తి పలికింది. అయితే, అంతే మొత్తాన్ని ఆహార పదార్థాల అసలు ధరల్లో కలిపేసింది.
మాయాజాలం ఇలా...
గతంలో అల్పాహారానికి రూ.105, లంచ్‌కు రూ.185, స్నాక్స్‌కు రూ.90 వసూలు చేసిన రైల్వే.. అన్నింటికీ అదనంగా రూ.50 సర్వీస్ ఛార్జీ వడ్డించేది. ఇప్పుడు రూ.50 సర్వీస్ ఛార్జీని తొలగించింది. అయితే, ఇక్కడే ఓ మెలిక పెట్టింది. అల్పాహారం ధరను రూ.155కు, లంచ్ ధర రూ.235కు, స్నాక్స్ ధర రూ.140కి పెంచేసింది. దీంతో వినియోగదారులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.