తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైళ్లు, స్టేషన్లలో అడుగడుగునా నిఘా - Railway ministry guidelines to prevent crimes against women

మహిళల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది రైల్వేశాఖ. మహిళలపై వేధింపులు, దాడులు పెరుగుతున్న తరుణంలో వాటి నియంత్రణపై దృష్టిసారించింది. ఈ మేరకు అన్ని జోనల్​ రైల్వేలకు మార్గదర్శకాలు జారీ చేసింది రైల్వేశాఖ.

Railway ministry takes steps to control attacks on women
రైళ్లు, స్టేషన్లలో అడుగడుగునా నిఘా

By

Published : Mar 21, 2021, 8:47 AM IST

రైళ్లలో మహిళలపై ఇటీవలి కాలంలో దాడులు, వేధింపులు పెరిగిన నేపథ్యంలో రైల్వేశాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలకు ఉపక్రమించింది. ప్రతిరోజూ రైళ్లలో 2.3 కోట్ల మంది ప్రయాణిస్తుండగా అందులో మహిళా ప్రయాణికుల సంఖ్య 46 లక్షల మేర ఉంటోంది. ప్రయాణ సమయాల్లో రైళ్లు, రైల్వేస్టేషన్ ప్రాంగణాల్లో వీరిపై నేరాలు జరుగుతుండటం ప్రధాన చర్చనీయాంశంగా మారడం వల్ల వాటి నియంత్రణ కోసం దృష్టిసారిస్తూ రైల్వే శాఖ శనివారం అన్ని జోనల్ రైల్వేలు, ఉత్పాదక యూనిట్లకు మార్గదర్శకాలు జారీచేసింది.

  • రైల్వే స్టేషన్లు, పార్కింగ్ ప్రాంతాలు సహా అన్ని ప్రాంతాల్లో తగిన వెలుతురు ఉండేలా ఏర్పాట్లు చేయాలి.
  • పాడుబడిన క్వార్టర్లను పూర్తిగా ధ్వంసం చేయాలి. కూలగొట్టేంతవరకు తనిఖీ చేస్తూ ఉండాలి.
  • స్టేషన్లలోకి రాకపోకలు సాగించడానికి వీలుగా ఉన్న ఆనధికార ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలను మూసేయాలి.
  • వెయిటింగ్​ రూములను నిర్మానుష్యంగా వదిలిపెట్టకూడదు. రాత్రిపూట ప్రయాణికులు పలుచగా ఉన్న సమయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకొనే ప్రవేశం కల్పించాలి.
  • కోచింగ్​ యార్డులు, డిపోల్లో తగిన నిఘా వ్యవస్థ నెలకొల్పాలి.
  • ఇంటర్​నెట్​ సర్వీస్​ ప్రొవైడర్ల సహకారం తీసుకుని రైల్వే స్టేషన్లలో అందిస్తున్న ఉచిత వైఫై ద్వారా ఆశ్లీల వైబ్​సైట్లు అందుబాటులోకి రాకుండా చూడాలి.
  • మహిళలను గౌరవించడం, వారికి ఉన్న హక్కులు, ఉల్లంఘనలకు పాల్పడినవారికున్న శిక్షల గురించి ప్రయాణికులను చైతన్యపరచడానికి అన్ని జోనల్ రైల్వే అధికారులు వీధి నాటకాల వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిచాలి.
  • అత్యాచారాలు, ఇతర తీవ్రమైన నేరాలు జరగడానికి అవకాశం ఉన్న స్థలాలను గుర్తించి వాటిపై నిఘా ఉంచడానికి క్రైమ్​ ఇంటెలిజెన్స్​, స్పెషల్​ ఇంటెలిజెన్స్​ బ్రాంచ్​ సేవలను ఉపయోగించుకోవాలి.
  • రైల్వే స్టేషన్​ చుట్టుపక్కల ప్రాంతాల్లో లైంగిక నేరగాళ్లు సంచరిస్తున్నారేమో తెలుసుకోవాలి.
  • ఒంటరిగా, చిన్నారులతో కలిసి ప్రయాణించే మహిళల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
  • మహిళా కోచ్​లు చిట్టచివరన గార్డ్​కోచ్​ పక్కన ఉంటాయి. సాధారణంగా ఇవి ప్లాట్ ఫామ్ ఏరియా బయటకొస్తాయి అందువల్ల స్టేషన్లో రైలు ఆగినప్పుడు రైల్వే భద్రతా దళాలు ఈ కోచ్​లను తనిఖీ చేయాలి.

ఇదీ చూడండి: 'అంతర్జాతీయ విద్యార్థులను భారత్‌కు ఆకర్షిద్దాం'

ABOUT THE AUTHOR

...view details