Railway Jobs 2024 :ఆర్ఆర్సీ నార్త్ వెస్ట్రన్ రైల్వే 1646 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు
- డీఆర్ఎం ఆఫీస్, అజ్మేర్ డివిజన్ - 402 పోస్టులు
- డీఆర్ఎం ఆఫీస్, బికనీర్ డివిజన్ - 424 పోస్టులు
- డీఆర్ఎం ఆఫీస్, జైపుర్ డివిజన్ - 488 పోస్టులు
- డీఆర్ఎం ఆఫీస్, జోధ్‌పుర్ డివిజన్ - 67 పోస్టులు
- బీటీసీ క్యారేజ్, అజ్మేర్ - 113 పోస్టులు
- బీటీసీ లోకో, అజ్మేర్ - 56 పోస్టులు
- క్యారేజ్ వర్క్‌షాప్, బికనీర్ - 29 పోస్టులు
- క్యారేజ్ వర్క్‌షాప్, జోధ్‌పుర్ - 67 పోస్టులు
- మొత్తం పోస్టులు - 1646
ట్రేడ్ విభాగాలు
ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, ఫిట్టర్, పెయింటర్, మాసన్, డీజిల్ మెకానిక్, వెల్డర్, మెకానిక్, మెషినిస్ట్. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.
విద్యార్హతలు
RRC Apprentice Qualifications : అభ్యర్థులు పదో తరగతితోపాటు, ఆయా పోస్టులకు అనుగుణంగా ఐటీఐలో కూడా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి
RRC Apprentice Age Limit :అభ్యర్థుల వయస్సు 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.