Railway jobs 2023 : రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సీ) సదరన్ రైల్వేలో 790 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ ఇంజినీర్, టెక్నీషియన్, అసిస్టెంట్ లోకో పైలట్, ట్రైన్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో (Southern Railway Recruitment 2023)దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు
Southern Railway Recruitment vacancy :
- అసిస్టెంట్ లోకో పైలట్/ టెక్నీషియన్ - 595
- జూనియర్ ఇంజినీర్ - 168
- ట్రైన్ మేనేజర్ - 27
విభాగాలు
Southern Railway Recruitment 2023:డీజిల్, సిగ్నల్, వెల్డర్, కార్పెంటర్, మాసన్, ప్లంబర్, పైప్ ఫిట్టర్, బ్లాక్‌స్మిత్, రివెటర్, ఎలక్ట్రికల్ తదితర విభాగాలు ఉన్నాయి.
విద్యార్హతలు
Southern Railway Recruitment Eligibility : అభ్యర్థులు ఆయా పోస్టులను అనుసరించి మెట్రిక్యులేషన్/ ఎస్ఎస్ఎల్సీ/ ఐటీఐ/ ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి
Railway Jobs Age Limit : అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 42 సంవత్సరాలు. అయితే ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం
Railway Recruitment Selection Process : అభ్యర్థులకు జనరల్ డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. అభ్యర్థులకు మొదటిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. దీనిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు.. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు. తరువాత మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి, అందులో కూడా క్వాలిఫై అయిన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
పే లెవల్స్
Railway Jobs Pay Levels 2023 :
- అసిస్టెంట్ లోకో పైలట్/ టెక్నీషియన్ - పే లెవల్ 2
- జూనియర్ ఇంజినీర్ - పే లెవల్ 6
- ట్రైన్ మేనేజర్ - పే లెవల్ 5
దరఖాస్తు విధానం
Southern Railway Recruitment 2023 Apply Online :
- అభ్యర్థులు ముందుగా https://rrcmas.in/ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజ్‌లోని సదరన్ రైల్వే రిక్రూట్మెంట్ 2023 లింక్‌పై క్లిక్ చేసి, ఓపెన్ చేయాలి.
- దరఖాస్తు ఫారంలో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి.
- దరఖాస్తు నింపిన తరువాత, విద్యార్హత పత్రాలను అప్లోడ్ చేయాలి.
- (అభ్యర్థులు ముఖ్యంగా పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, సిగ్నేచర్, సెల్ఫ్ అటాస్టెడ్ సర్టిఫికేట్స్, కుల ధ్రువీకరణ పత్రం, దివ్యాంగులు ఫిజికల్ డిజేబులిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.)
- అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
Southern Railway Recruitment Last Date :
- దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 జులై 30
- దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 ఆగస్టు 30