తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Railway Jobs 2023 : ఐటీఐ అర్హతతో.. ఈస్ట్రన్​ రైల్వేలో 3,115 అప్రెంటీస్​ ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా! - రైల్వే అప్రెంటీస్ ఉద్యోగాలు

Railway Jobs 2023 In Telugu : ఈస్ట్రన్ రైల్వే 3,155 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

RRC ER Recruitment 2023 for 3115 Vacancies
Railway Jobs 2023

By ETV Bharat Telugu Team

Published : Sep 15, 2023, 11:09 AM IST

Railway Jobs 2023 : ఐటీఐ చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అందరికీ గుడ్​ న్యూస్. రైల్వే రిక్రూట్​మెంట్​ సెల్​ (RRC).. కోల్​కతాలోని ఈస్ట్రన్​ రైల్వే పరిధిలోని వర్క్​షాప్​లు, డివిజన్​లలో ఉన్న 3,115 అప్రెంటీస్​ పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ( RRC Apprentice Recruitment 2023 )

ఐటీఐ ట్రేడ్స్​
మెకానిక్​, ఫిట్టర్​, వెల్డర్​, మెషినిస్ట్, కార్పెంటర్​, పెయింటర్​, లైన్​మ్యాన్​, వైర్​మ్యాన్​, ఎలక్ట్రీషియన్, ఎంఎంటీఎం, సివిల్​ ఇంజినీర్​, టర్నర్​, రిఫ్రిజిరేటర్​ అండ్ ఏసీ మెకానిక్​, ఎలక్ట్రానిక్స్ మెకానిక్​

విద్యార్హతలు
అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఆయా పోస్టులకు అనుగుణంగా సంబంధిత ట్రేడ్​ విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో ఐటీఐ క్వాలిఫై అయ్యుండాలి.

వయోపరిమితి
అభ్యర్థుల వయస్సు 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి.

దరఖాస్తు రుసుము
అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం
అభ్యర్థులను.. మెట్రిక్యులేషన్​, ఐటీఐ మార్కుల్లో వచ్చిన మెరిట్​ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇందుకోసం ముందుగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు. తరువాత మెడికల్ ఎగ్జామినేషన్​ చేసి.. అందులోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు. ( RRC ER Apprentice Recruitment 2023 )

దరఖాస్తు విధానం

  • అభ్యర్థులు ముందుగా ఆర్​ఆర్​సీ అధికారిక వెబ్​సైట్​ http://rrcer.com/ ను ఓపెన్ చేయాలి.
  • ఈస్ట్రన్ రైల్వే అప్రెంటీస్ రిక్రూట్​మెంట్​ లింక్​పై క్లిక్ చేయాలి.
  • దరఖాస్తు ఫారంలో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి. తరువాత..
  • మీ ట్రేడ్​ విభాగాన్ని, దివ్యాంగులు అయితే వారి డిజేబిలిటీని కన్ఫార్మ్ చేయాలి.
  • మీ ఈ-మెయిల్​ ఐడీ, ఫోన్ నంబర్ నమోదు చేయాలి.
  • మీరు ఏ యూనిట్​లో పనిచేయాలని అనుకుంటున్నారో.. దానిని సెలెక్ట్ చేసుకోవాలి.
  • స్కాన్​ చేసిన మీ ఫొటో, సిగ్నేచర్​ సహా, మీ విద్యార్హత సర్టిఫికేట్లు అప్​లోడ్​ చేయాలి.
  • అప్లికేషన్ ఫీజు అన్​లైన్​లోనే చెల్లించాలి.
  • దరఖాస్తులోని వివరాలు అన్నీ మరోసారి సరిచూసుకొని, సబ్మిట్​ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్​లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 సెప్టెంబర్​ 27
  • ఆన్​లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 అక్టోబర్​ 26

ABOUT THE AUTHOR

...view details