భారీ వర్షాలు రైలు ప్రమాదానికి కారణమయ్యాయి. గోవాలోని ప్రఖ్యాత దూద్‌సాగర్ జలపాతం వద్ద ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైలు పట్టాలపై కొండ చరియలు విరిగి పడడం వల్ల కర్ణాటకలోని మంగళూరు నుంచి మహారాష్ట్ర ముంబయి వెళ్తున్న రైలు... సోనాలిమ్, దూద్‌సాగర్ స్టేషన్ల మధ్య ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు- భారీ వర్షాలే కారణం - వరదలు
గోవాలోని ప్రఖ్యాత దూద్‌సాగర్ జలపాతం వద్ద రైలు ప్రమాదం జరిగింది. మంగళూరు నుంచి ముంబయి వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.
గోవా సమీపంలో రైలు ప్రమాదం
గోవా సీఎం ప్రమోద్ సావంత్, ఉపముఖ్యమంత్రి బాబు అజ్గోయంకర్ ఘటనా స్థలిని సందర్శించి, సహాయక చర్యలు సాగుతున్న తీరును పరిశీలించారు.