Railway crew member risk: అనవసరంగా చైన్ లాగడం వల్ల నడి వంతెనపై నిలిచిపోయిన ఓ రైలును మళ్లీ ప్రారంభించేందుకు లోకో పైలట్ ప్రాణాలను పణంగా పెట్టిన ఘటన బిహార్‌లో జరిగింది. ఛప్రాకు వెళ్తున్న గోదాన్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ చైన్ లాగాడు. ఫలితంగా ముంబయికి 80 కిలోమీటర్ల దూరంలోని తిత్వాలా- ఖడవలి స్టేషన్‌ల మధ్య ఓ వంతెనపై రైలు నిలిచిపోయింది. దాన్ని పునఃప్రారంభించాలంటే చైన్‌ను లాగిన బోగీ కింది అలారం చైన్ నాబ్‌ను రీసెట్ చేయాలి. దీంతో సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ సతీష్ కుమార్ దాన్ని రీసెట్ చేయడానికి సాహసమే చేశారు. వంతెనపై ప్రమాదకర పరిస్థితుల్లో బోగీ కింది పరికరాలు, చక్రాల పక్కగా లోపలికి వెళ్లి.... దాన్ని సరిచేశారు.
లోకో పైలట్ సాహసం.. రైల్వే మంత్రి ప్రశంసల వర్షం - లోకో పైలట్ సాహసం
Loco Pilot Risk: వంతెనపై నిలిచిపోయిన రైలు ప్రారంభించేందుకు సాహసం చేశాడు లోకో పైలట్. అతని నిబద్ధతను చూసి రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ కొనియాడారు. ఇందుకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
లోకో పైలట్ సాహసం
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అకారణంగా అలారం చైన్ లాగడం చాలా మందికి ఇబ్బంది కలిగిస్తుందని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఎమర్జెన్సీ చైన్ లాగాలని రైల్వేశాఖ తన ట్వీట్‌లో ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది. రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సైతం లోకో పైలట్ నిబద్ధతను ట్విటర్‌లో కొనియాడారు. అతని సాహసం దృశ్యాలను ట్వీట్ చేశారు.